Breaking News

టీడీపీ మట్టి మాఫియాకు మరో డ్రైవర్‌ బలి

Published on Sun, 07/26/2026 - 03:50

పెదనందిపాడు: టీడీపీ కూటమి నేతల మట్టి మాఫి­యాకు మరో డ్రైవర్‌ బలయ్యాడు. కూలి కోసం, కుటుంబం గడవడం కోసం మట్టి సిండికేట్‌ ఇచ్చే డబ్బులకు ఆశపడి పగలూరాత్రీ పని చేస్తున్న డ్రైవర్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పల్నా­డు జిల్లా నకరికల్లు మండలం కుంకులగుంటలో మంగళవారం టిప్పర్‌ డ్రైవర్‌ మరణించిన వి­షయం మరువకముందే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో శనివారం మరో డ్రైవర్‌ అసు­వులుబాశాడు. ఈ దుర్ఘటనలు మట్టిమాఫియా అ­రా­చకాలకు అద్దం పడుతున్నాయి.

గుంటూరు జి­ల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామ పరిధిలోని ఉన్న నల్లమడ వాగులో అక్రమంగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పగలూరాత్రీ తేడా లేకుండా అక్రమ రవాణా జరు­గుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లా, పర్చూరు మండలం అడుసుమల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ రావి సతీష్‌ (36) ఇక్కడ కొన్నాళ్లుగా మట్టి రవాణా చేస్తున్నాడు. పగలూరాత్రీ పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని సిండికేట్‌ ఆశ పెట్టడంతో మట్టి తోలుతున్నాడు.

శుక్రవారం అర్ధరాత్రి మట్టి తరలిస్తుండగా వేకువజా­మున 3 గంటలకు నాగుల­పాడు సమీపంలోని నల్లమడవాగు బ్రిడ్జి వద్ద ట్రాక్టర్‌ అ­దుపుతప్పి పక్కనున్న పొలాల్లోకి బోల్తాకొట్టింది. ఈ ప్ర­మాదంలో సతీష్‌ ట్రాక్టర్‌ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సతీ‹Ùకు భార్య, కుమార్తె, కు­మారుడు ఉన్నారు. ఈ దుర్ఘటనతో మట్టి సిండికేట్‌ స­భ్యులు నల్లమడ వాగు వద్ద ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లను వెంటనే తరలించేశారు. మృతు­ని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమా­ర్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

టీడీపీ ఎమ్మెల్యే బూర్ల అండతోనే.. !
ఇదిలా ఉంటే పెదనందిపాడు మండలంలోని ఓగేరువాడు, నల్లమడ వాగు, నక్కవాడు, మేకల వాగుల్లో యథేచ్ఛగా మట్టి మాఫియా తవ్వకాలకు పాల్పడుతోంది. ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అండతో చెలరేగిపోతోంది. పొలాల మెరక కోసం అంటూ రైతుల ముసుగులో మట్టిని యథేచ్ఛగా తవ్వేసి ట్రక్కు మట్టి రూ.800 నుంచి రూ.1,200 వరకు అమ్మి అక్రమా­ర్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనికోసం చీరాలలోని డ్రెయినేజీ అధికారులకూ మా­మూళ్లు సమరి్పంచినట్టు తెలుగుదేశం కూట­మి నేతలు బాహాటంగానే చెబుతున్నారు. 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)