Breaking News

Andhra Pradesh: ఇక టూరిస్ట్‌ పోలీసింగ్‌

Published on Fri, 01/13/2023 - 04:20

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ వెళ్లే పర్యాటకులను ‘హాయ్‌ వెల్‌కం టు వైజాగ్‌. హౌ కెన్‌ ఐ హెల్ప్‌ యూ’.. ‘ఇన్‌ వైజాగ్‌ యూ కెన్‌ సీ ఆర్‌కే బీచ్, రుషికొండ, భీమిలి, కైలాసగిరి, సింహాచలం టెంపుల్‌. ఇఫ్‌ యూ హేవ్‌ ఎనీ ప్రాబ్లమ్‌. ప్లీజ్‌ కాంటాక్ట్‌ అజ్‌’ అంటూ ప్రేమగా పలకరించేందుకు ప్రత్యేకంగా టూరిస్ట్‌ పోలీసులు అందుబాటులోకి రానున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు సమస్త సమాచారాన్ని అందిచడంతో పాటు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలా టూరిస్ట్‌ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

మొదటగా విశాఖలోని ఆర్‌కే బీచ్‌ వద్ద ప్రత్యేకంగా టూరిస్ట్‌ పోలీస్‌ కియోస్క్‌ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పర్యాటక ప్రదేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఉమ్మడి విశాఖలో చూడదగిన పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని బ్రోచర్ల రూపంలో అందుబాటులో ఉంచనున్నారు. పర్యాటకులు ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా.. ఎవరైనా తప్పిపోయినా వీరికి ఫిర్యాదు చేస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.

పర్యాటకుల నుంచి ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే కూడా వీరికి సమాచారం ఇస్తే చర్యలు తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తు­న్నారు. మొత్తంగా రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి ప్రయాణం సాఫీగా సాగేలా చూడటంతోపాటు మరోసారి వచ్చే విధంగా ఆకర్షించేందుకు టూరిస్ట్‌ పోలీసింగ్‌ తోడ్పడుతుందనేది ప్రభుత్వ వర్గాల భావన. 

జీ–20 సమావేశాల నేపథ్యంలో..
విశాఖలో వరుసగా వివిధ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 28, 29 తేదీల్లో జీ–20 దేశాల సమావేశాలకు కూడా విశాఖ వేదిక కాబోతోంది. దీనికి విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం ప్రతినిధులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా టూరిస్ట్‌ పోలీసింగ్‌ విధానం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 55 ప్రాంతాల్లో 200 వరకూ జీ–20 గ్రూప్‌ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. 

2016 నుంచీ చేయాలనుకున్నా..
వాస్తవానికి దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్‌ పోలీసింగ్‌ అభివృద్ధి చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఇందుకు అనుగుణంగా 2016లోనే ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్ప­టికీ రాష్ట్రంలో ఈ విధానం అమలుకు నోచు­కో­లేదు. 2019లో 25 ప్రాంతాల్లో పైలట్‌ ప్రా­జెక్టు కింద అమలు చేయాలని కేంద్రం ఆదే­శించింది. అయితే, కోవిడ్‌ నేపథ్యంలో అమ­లుకు నోచుకోలేదు. తాజాగా జీ–20 సమా­వేశాల నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖలో ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 

కియోస్క్‌ ఏర్పాటు చేస్తున్నాం
విశాఖ నగరంలో టూరిస్ట్‌ పోలీసింగ్‌ విధా­నాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ఆర్‌కే బీచ్‌ ప్రాంతంలో మొదటగా ఒక కియోస్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా పర్యాటకులకు సేవలందించేందుకు పోలీసులు అందుబాటులో ఉంటారు. తర్వాత మిగిలిన పర్యాటక ప్రదేశాలైన భీమిలి, రుషికొండ, తెన్నేటి పార్కు, కైలాసగిరి, యారాడ వంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
– శ్రీకాంత్, నగర పోలీస్‌ కమిషనర్‌  

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)