Breaking News

ఏయూలో ఉద్యోగాలు కోత కథనాలన్నీ అవాస్తవాలే

Published on Sun, 09/03/2023 - 05:35

ఏయూ క్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యుల ఉద్యోగాల భర్తీలో 200 పోస్టులకు కోత అని, ఏయూకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవాలు లేవని ఏయూ అకడమిక్‌ డీన్‌ ఆచార్య ఎ.కిశోర్‌బాబు తెలిపారు. శనివారం పచ్చ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన వివరణ ఇచ్చారు. 2015–16లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నియమించిన రేషనలైజేషన్‌ కమిటీ అధ్యయనం తరువాత 2017లో ఉన్నత విద్యాశాఖ జీవోఎంఎస్‌ 39ని విడుదల చేసిందని, దీనిలో ఏయూలో 936 ఖాళీలకు గాను రేషనలైజేషన్‌ తరువాత 750 ఉద్యోగాలు ఉన్నట్లు తేల్చిందని చెప్పారు.

కమిటీ సూచించిన ఖాళీల్లో తొలి దశలో 281, రెండో దశలో 104 ఉద్యోగాలు వెరసి 391 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయాలంటూ జీవో 39లో పేర్కొందని తెలిపారు. అయినప్పటికీ ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేకపోయిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ జీవోఎంఎస్‌ 61ని విడుదల చేస్తూ ఏయూలో ఒకే దఫాలో మొత్తం 726 ఖాళీలు భర్తీ చేయాలని సూచించిందని చెప్పారు. ప్రస్తుత రేషనలైజేషన్‌ కమిటీ గత ఎనిమిది నెలల కాలంగా శాస్త్రీయంగా పరిశీలన జరిపి అందరి నుంచి వివరాలు తీసుకుని 726 ఉద్యోగాలు భర్తీచేయడానికి నోటిఫికేషన్‌ సిద్ధం చేయాలని సూచించిందని వెల్లడించారు.

దీనిని పరిశీలిస్తే ఏయూలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో భర్తీ చేయాలని విడుదల చేసిన ఖాళీల కంటే అధికంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం సూచించిందనే వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. ఏయూ అవసరాల దృష్ట్యా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

కేవలం 24 పోస్టులే తగ్గాయి  
ప్రస్తుతం ఏయూలో దూరవిద్య కేంద్రం పూర్తిగా ఆటోమేషన్‌ చేయడంతో పాటు విజయనగరం, కాకినాడ, తాడేపల్లిగూడెం పీజీ సెంటర్‌లను మూసివేయడం, ఇతర విశ్వవిద్యాలయాల్లో విలీనం చేయడం జరిగింది.  క్యాంపస్‌లో న్యూక్లియర్‌ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, బయో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ వంటి కోర్సులకు విద్యార్థుల నుంచి తగినంత స్పందన లేకపోవడంతో నిలిపివేశారు. దీనికారణంగా కేవలం 24 ఉద్యోగాలు మాత్రమే తగ్గాయనే వాస్తవాన్ని గుర్తెరగాలని సూచించారు.  

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)