Breaking News

బర్లీ పొగాకు ధర పతనం

Published on Fri, 04/11/2025 - 04:59

సాక్షి, అమరావతి  : నాటు పొగాకుగా పిలిచే బర్లీ పొగాకు ధరలు అనూహ్యంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి కాదు కదా.. కనీసం కౌలు కూడా వచ్చే పరిస్థితి లేక దిగాలు పడుతున్నారు. గతేడాది ఇదే సమయంలో క్వింటాల్‌ రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలకగా, ఈ ఏడాది తేమ శాతం వంకతో క్వింటాల్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు మించికొనే పరిస్థితి కూడా కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని నల్ల నేలల్లో బ్లాక్‌ బర్లీ, ఎర్ర నేలల్లో వైట్‌ బర్లీ సాగు చేస్తారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 

చేతులెత్తేసిన కంపెనీలు 
ఐటీసీ, జీపీఐ, డక్కన్, ఆలయన్స్‌ వంటి పొగాకు కంపెనీలు అభయమివ్వడంతో రైతులు బర్లీ పొగాకు సాగు చేశారు. గత ఏడాది ఈ రకం పొగాకు 1.95 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఈ ఏడాది దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు రూ.1.50 లక్షలకు పైగా రైతులు ఖర్చు చేశారు. కౌలు కోసమే ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించారు. 

అయితే, తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 11–12 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. చివరకు విత్తనాలు ఇచ్చి సాగు చేయమని చెప్పిన పొగాకు కంపెనీలు పంట చేతికొచ్చే సమయాయిని పత్తా లేకుండా పోయాయి. దీంతో క్వింటాల్‌ రూ.2,500 నుంచి రూ.3 వేల చొప్పున దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

అప్పట్లో అండగా నిలిచిన గత ప్రభుత్వం 
గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి తేమ శాతంతో సంబంధం లేకుండా దాదాపు 30వేల మంది రైతుల నుంచి రూ.139.19 కోట్ల విలువైన 12,933 టన్నుల పొగాకు సేకరించింది. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా లేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)