Breaking News

భగ్గుమన్న పొగాకు రైతులు

Published on Wed, 01/28/2026 - 05:22

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పొగాకు రైతులు భగ్గుమన్నారు. సిగరెట్లపై 70 శాతానికిపైగా పెంచిన ఎక్సైజ్‌ సుంకాన్ని తక్షణమే ఉపసంహరింపచేయాలని ఆందోళన చేశారు. నెల్లూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన 400 మందికిపైగా పొగాకు రైతులు తరలివచ్చి కార్యాలయం బయట ఆందోళన చేశారు. కేంద్రం తీసుకున్న పెంచిన సుంకాలను తక్షణమే ఉపసంహరింప చేయకపోతే పొగాకు రైతులతోపాటు పరిశ్రమ­పై ఆధారపడిన లక్షలాదిమంది జీవనోపాధి దెబ్బ­తింటుందని ఆవేదన చెందారు. 

ఈ సందర్భంగా పొగాకు సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారు. ఎక్సైజ్‌ సుంకం పెంపు వల్ల పరిశ్రమకు కలిగే నష్టాలను వివరించారు. ఇప్పటికే మార్కెట్‌లో నెలకొ­న్న అనిశ్చితి వల్ల ధర లేక ఈ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెంచిన ఎక్సైజ్‌ సుంకం ప్రభావం వలన పొగాకు మార్కెట్‌ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పా­రు.  మార్కెటింగ్‌ సీజన్‌కు ముందే ఈ ప్రభావం క్షేత్ర స్థాయిలో కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచడం వలన అక్రమ సిగరెట్ల వ్యాపారం, అక్రమ రవాణా పెరిగిపోతోందన్నారు.

పన్నులు చెల్లించని, నియంత్రించని ఉత్పత్తులు మార్కెట్‌ను ఆక్రమించడమే కాక, నాసిరకం ఉత్పత్తుల కారణంగా ప్రజల ఆరోగ్యా­లు దెబ్బతింటాయన్నారు.  సుంకం పెంపు వల్ల ఎఫ్‌సీవీ పొగాకును అత్యధికంగా ఉత్పత్తి చేసే ఆంధ్రప్రదేశ్‌కు అపార నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. తక్షణమే కేంద్రం సుంకం పెంపును వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రైతు ప్రతినిధులు చంద్రబాబును డిమాండ్‌ చేశారు. అనంతరం పొగాకు రైతులు మీడియాతో మాట్లాడుతూ సీఎం సమస్య పరిష్కారానికి  కృషి చేస్తానని హామీ ఇచ్చారని వివరించారు.

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)