Breaking News

ఫ్రీ బస్సు ‘బాబూ’

Published on Thu, 03/20/2025 - 05:14

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణంపై తిరుపతి మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. బుధవా­రం ఉదయం ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు.. తమకు చంద్రబాబు ఇచ్చిన హామీని కండక్టర్‌కు గుర్తుచేశారు. ప్రయాణికులకు టికెట్‌లు కొట్టుకుంటూ వచ్చిన కండ­క్టర్‌.. మహిళలను కూడా టికెట్‌ అడిగారు. ఈ సంద­ర్భంగా వారు.. ‘చంద్రబాబు చెప్పారు. బ­స్సు­లో ప్రయాణం ఉచితమని. 

టికెట్‌ అడిగితే చంద్రబాబు గారు ఆయన పేరు చెప్పమన్నారు’ అని సమాధా­నమిచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు. అదేవిధంగా చంద్రబాబు వేషధారణలో ఓ వ్యక్తి కండక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ‘‘నేను చెబుతున్నాను.. నా ఆడబిడ్డలందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చెయ్యవచ్చు’’ అని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక కండక్టర్‌.. బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఉత్తర్వు­లు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. 

ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ స్పష్టం చేశారు. దీంతో కండక్టర్, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కండక్టర్‌ పోలీసు­లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనల మేరకు డ్రైవ­ర్‌ బస్సును నేరుగా ఎస్వీ యూనివర్సిటీ స్టేషన్‌కు తరలించారు. కండక్టర్‌ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్‌ పోలీసులు 35 మందిపై కేసు నమోదు చేశారు. వీరికి వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో మేయర్‌ డాక్టర్‌ శిరీష, వైఎస్సార్‌సీపీ నగర, మహిళా విభాగం అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, గీతాయాదవ్‌ సంఘీభావం తెలిపారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)