Breaking News

సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్‌!

Published on Sun, 01/19/2025 - 03:18

తిరుపతి కల్చరల్‌: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని రక్షించాలని తిరు­పతి సభలో హిందూ డిక్లరేషన్‌ ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ తిరుమల క్షేత్రంలో ధర్మానికి విరుద్ధంగా సాగుతున్న విషయాలపై ఎందుకు నోరు మెదపటం లేదని పలువురు స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అని నిలదీశారు. తిరుమలలో అపచారాలు, తిరుమల కొండకు సమీపంలో చేపడుతున్న ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీటీడీ పరిపాలనా భవనం ఎదుట శనివారం స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం ఫోటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి గోవింద నామస్మరణలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ఏమన్నారంటే..

సనాతన ధర్మం రక్షణ అంటే ఇదేనా?
తిరుమల శ్రీవారు తమ కులదైవమని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే.. హిందూ డిక్లరేషన్‌ అంటూ పవన్‌కళ్యాణ్‌ సభపెట్టి సనాతన ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. చట్ట విరుద్ధంగా ముంతాజ్‌ హోటల్‌కు అనుమతులు ఇస్తూ దగా చేయడం దుర్మార్గం. చెప్పిందొకటి చేసేది మరొకటిగా కూటమి ప్రభుత్వ ధోరణి ఉంది. – శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, అధ్యక్షుడు, ఏపీ సాధు పరిషత్‌

పవిత్రతకు భంగం కలిగిస్తే శంఖారావం పూరిస్తాం
తిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులకు స్వస్తి చెప్పకపోతే గోవింద శంఖారావం పూరించి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తాం. సనాతన ధర్మం అంటూ ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తిరుమల క్షేత్రంలో ధర్మ విరుద్ధ పనులు సాగుతున్నా ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు. మందు, మాంసాహార విందుల సౌకర్యాలతో కూడిన ముంతాజ్‌ హోటల్‌ ఏర్పాటును హిందూ సమాజం వ్యతిరేకిస్తోంది. – తుమ్మా ఓంకార్, తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు

రాజకీయం చేయడం దుర్మార్గం
తిరుమలను రాజకీయ క్షేత్రంగా మార్చి ధర్మబద్ధతకు తూట్లు పొడవ­డం విడ్డూరం. సనాతన ధర్మం పేరు­తో ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్‌కళ్యాణ్‌ నేడు తిరు­మలలో సనా­తన ధర్మానికి వెన్నుపోటు పొడిచే కార్యక్ర­మాలు సాగుతున్నా మాట్లాడకపోవడం దారుణం. ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణం చేపట్టడం హేయమైన చర్య. తిరు­మలకు మాంసాన్ని తీసుకెళ్లి పవిత్రతను దెబ్బతీసినా నిమ్మ­కు నీరెత్తినట్టు వ్యహరించడం చేతకానితనానికి నిదర్శనం. – శివానంద స్వామీజీ, ఏపీ సాధు పరిషత్‌ ప్రతినిధి

హోటల్‌ అనుమతులు రద్దు చేయాలి
తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా అలిపిరి సమీపంలో చట్టవిరుద్ధంగా చేపడుతున్న ముంతాజ్‌ హోటల్‌ అనుమతులును వెంటనే రద్దు చేయాలి. తిరుమలలో పవిత్రత దెబ్బతీసే కార్యక్రమాల పట్ల పటిష్ట చర్యలు తీసుకోవాలి.  కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం పరిరక్షణను విస్మరించడం శోచనీయం. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్ర మంటగలుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం
–  విజయ భాస్కర్, హిందూ సంఘాల ప్రతినిధి, కర్ణాటక

పుట్టగతులుండవు
తిరుమల శ్రీవారితో చెల­­గాటాలాడితే పుట్టగ­తు­లుండవు. సనాతన ధర్మ పరిరక్షణ, తిరు­మల ప్రక్షాళనే లక్ష్య­మన్న కూటమి అధికా­రంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహ­రిస్తూ తిరుమల క్షేత్ర పవిత్రతను దెబ్బ తీస్తు­న్నారు. ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణాలకు అను­మ­తు­లు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. తిరు­మ­లకు మాంసం తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. – సాధు మహరాజ్, శ్రీజ్ఞానపీఠం ప్రతినిధి

ధర్మరక్షణకు చర్యలు చేపట్టాలి
తిరుమలలో వరు­సగా సాగుతున్న అపవిత్ర కా­ర్య­క్ర­మా­లకు స్వస్తి పలి­కి సనా­తన ధర్మ పరి­రక్షణకు కూటమి ప్రభు­త్వం చర్య­లు చేప­ట్టాలి. తిరు­మ­ల పవిత్రతను దెబ్బతీసేలా చేపడు­తున్న ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణాలను తక్షణమే నిలిపి­వే­యాలి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు కొనసాగితే ఆందోళనలు చేపట్టక తప్ప­దు.– కిరణ్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)