Breaking News

డాక్టర్‌ అవతారమెత్తి.. చైన్‌ కొట్టేసి!

Published on Thu, 01/16/2025 - 08:14

తిరుపతి తుడా : పేద రోగులే టార్గెట్‌గా రుయాలో దొంగలు హల్‌ చల్‌ చేస్తున్నారు... రోగుల సహాయకులుగా తరచూ పేషంట్‌ వార్డుల్లో తిరుగుతూ సెల్‌ఫోన్లు, పర్సులు దొంగతనం చేసే ముఠా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ఏకంగా తెల్ల కోటు ధరించి డాక్టర్‌ వేషం ధరించి చోరీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. రుయా ఆస్పత్రిలో తరచూ మొబైల్‌ ఫోన్లు, పర్సులు, ఏటీఎం కార్డులు, బైక్‌ దొంగతనాలు జరగడం సర్వసాధారణమైంది . 

ఈ క్రమంలోనే తెల్ల కోటుతో వచ్చి రోగులను బురిడీ కొట్టించి ఐదు సవర్ల బంగారు చైను చోరీ చేసిన యువతిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం రుయాలో చోటుచేసుకుంది... వైఎస్సార్‌ జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి అనే యువతి అనస్తీషియా టెక్నీషియన్‌ అని రోగులకు చెప్పుకుంటూ అత్యవసర విభాగంలో తిరుగుతూ ఉండేది. 

ఈ క్రమంలో అప్పుడే రేణిగుంట నుంచి గాయాలతో వైద్యం కోసం వచ్చిన వెస్లీ అనే మహిళను గుర్తించి పరిచయం చేసుకుంది. అనంతరం స్కానింగ్‌ కోసం తీసుకెళ్లి ఒంటిపై నగలు తీసేయాలని సూచించింది. వెస్లీ తన ఒంటిపై ఉన్న రెండు బంగారు చైన్లు, రెండు బంగారు గాజులను తీసి ఆ యువతి చేతికి ఇచ్చి బయట తన భర్తకు ఇవ్వాలని చెప్పింది. అయితే శ్రీవాణి చేతివాటం ప్రదర్శించి ఐదు సవర్ల బంగారు గొలుసును తన బ్యాగులో వేసుకొని మిగిలిన వస్తువులను వెస్లీ భర్త చేతికి ఇచ్చింది. 

ఇందులో మరో చైన్‌ ఉండాలని వెస్లీ భర్త విక్టరీ అడగడంతో మాకేం తెలుసు అంటూ ఆ యువతి అక్కడినుంచి వెళ్లిపోయింది. స్కానింగ్‌ నుంచి బయటికి వచ్చిన వెస్లీ నగలు చూసి అందులో ఒక చైన్‌ లేకపోవడాన్ని గుర్తించి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమై గాలింపు చేపట్టారు. అక్కడే ఉన్న యువతిని గుర్తించి ఆమె బ్యాగులో బంగారు చైన్‌ను గుర్తించారు. వెస్ట్‌ పోలీసులకు యువతిని అప్పగించారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)