Breaking News

‘చచ్చిపో.. కాలేజీకి ఒకరోజైనా సెలవు ఇస్తారు’

Published on Fri, 12/12/2025 - 12:35

సాక్షి,తిరుపతి: ‘నువ్వ చచ్చిపో.. చచ్చిపోతే కాలేజీకి ఒక్కరోజైనా సెలవు ఇస్తారంటూ’ అవమానించడంతో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.

కుప్పంకు చెందిన విద్యార్థి జస్విన్‌ తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో  డిసెంబర్ 10వ తేదీన ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే,జస్విన్‌ ఆత్మహత్యాయత్నానికి కాలేజీ అధ్యాపకులే కారణమని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘నీకు చదువు ఎందుకు? నువ్వు చనిపోతే కాలేజీకి ఒక రోజు సెలవు వస్తుంది’ అంటూ ఓ అద్యాపకురాలు తోటి విద్యార్థుల ముందు అమానుషంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ అవమానాలు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక జస్విన్‌  సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. 

తల్లిదండ్రుల ఆవేదన
జస్విన్‌ తల్లి రాధ కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ.. ‘నా కొడుకు పట్ల కాలేజీ లెక్చరర్లు దారుణంగా మాట్లాడారు. సరైన సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది’ అని ఆరోపించారు.  తన కుమారుడి పరిస్థితికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

యాజమాన్యం వైఖరిపై విమర్శలు
ఈ ఘటనపై ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పటికీ, కాలేజీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు, సంఘాలు మండిపడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, దళిత సంఘాలు ఎన్ఆర్ఐ కళాశాల ముందు బైటాయించి నిరసనలు చేపట్టాయి. విద్యార్థులపై వేదింపులు ఆపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)