Breaking News

తిరుపతి: వీడిన కొత్తశానంబట్ల మంటల మిస్టరీ

Published on Mon, 05/22/2023 - 10:49

సాక్షి, తిరుపతి: ఉన్నట్లుండి గడ్డివాములకు నిప్పంటుకోవడం.. ఇళ్లలో బట్టలకు మంటలు..  ఒకానొక టైంలో తాళం వేసిన ఇళ్లలోని బీరువాలో బట్టలు తగలబడిపోవడం.. జిల్లాలో గత నెలరోజులుగా చర్చనీయాంశంగా మారింది శానంబట్ల(కొత్త) గ్రామ మంటల మిస్టరీ. భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ గడిపారు ఆ ఊరి ప్రజలు. ఒకానొక టైంలో ఇది ఊరికి పట్టిన శాపమంటూ ఊరు విడిచిపోయారు కొందరు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేర్చారు. ఆకతాయిల పనిగా మొదలై.. ఇది ప్రతీకార చర్యగా కొనసాగిందని నిర్ధారించారు.  

చంద్రగిరి మండలం కొత్తశానంభట్ల గ్రామం లో మంటల మిస్టరీ చేధించారు పోలీసులు. తొలుత కొందరు ఆకతాయిలు ఓ గడ్డివాముకు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇదనుగా తల్లి  బంధువులపై విద్వేషంతో రగిలిపోతున్న కీర్తి అనే మహిళ.. తొలుత ఎదురింట్లో గడ్డివాముకు నిప్పు పెట్టింది. ఆ తర్వాత వరుసగా బంధువుల ఇళ్లలో నిప్పు పెడుతూ వచ్చింది. కేవలం అగ్గిపుల్లలతోనే నిప్పు పెడుతూ ఊరందరినీ భయభ్రాంతులకు గురి చేసిందామె. 

ఈలోపు అగ్ని ప్రమాదంలో నష్టపోయివారికి కొందరు ఆర్థిక సాయం అందిస్తూ వచ్చారు. దీంతో అత్యాశకు పోయిన గ్రామంలోని ఇద్దరు.. కావాలనే తమ ఇళ్లలో నిప్పు పెట్టుకున్నారు. దర్యాప్తులో ఇదంతా గుర్తించిన పోలీసులు.. కీర్తితో పాటు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం వాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు ఎంఆర్‌పల్లి పోలీసులు.

ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి గడ్డి వాములు తగలబడి పోవడం, బీరువాలు, కప్‌బోర్డుల్లోని బట్టలకు నిప్పంటుకోవడంలాంటి పరిణామాలతో కొత్తశానంభట్ల గ్రామస్తులు వణికిపోయారు. తొలుత పిల్లపాలెం అన్నదమ్ములకు సంబంధించిన నాలుగు ఇళ్లలో, వారి పొలాల్లో మాత్రమే మంటలు వ్యాప్తి చెందగా.. ప్రస్తుతం ఇతరుల ఇళ్లలోనూ మంటలు వ్యాపించడంతో ప్రజలు వణికిపోయారు. ఈ మంటల వెనుక కారణం ఏంటో తేల్చే  పనిలో పోలీసులు తలమునకలయ్యారు. క్లూ టీంతో ఆధారాలు సేకరిస్తూ.. గ్రామంలో భారీగా పికెటింగ్‌ నిర్వహించారు. అదే సమయంలో.. ఇది గ్రామ దేవత శాపమని, ఓ బుడబుక్కలవాడి శాపమని, కాదు.. 40 ఏళ్ల కిందట సైతం ఇలాగే మంటలు వ్యాపించేవని కొందరు వృద్ధులు ప్రచారంలోకి దిగడం గమనార్హం.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)