Breaking News

జనసేన కిరణ్‌ రాయల్‌ లీలలు.. వెలుగులో​కి మరో సంచలన వీడియో

Published on Sun, 02/09/2025 - 13:27

సాక్షి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్‌చార్జి కిరణ్‌ రాయల్‌ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్‌ రాయల్‌ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్‌ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా కిరణ్‌ రాయల్‌ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది.

కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించిన మహిళలు
జనసేన ఇంచార్జీ కిరణ్ రాయల్ ఇంటిని మహిళలు ముట్టడించారు. మహిళను మోసం చేసిన కిరణ్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. గొడవ చేస్తే మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ  పోలీసులు బెదిరించారు. బాధితురాలి న్యాయం జరిగే వరకు కదిలేదని.. మహిళలు మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదంటూ ప్రశ్నిస్తూ.. ఇదేనా మీరు రక్షణ కల్పించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమగ్ర విచారణ జరిపించాలి
జనసేన నేత  కిరణ్‌ రాయల్‌పై మహిళా సంఘాలు మండిపడుతున్నారు. మహిళను మోసం చేసిన ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఐద్వా తిరుపతి జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి మాట్లాడుతూ.. బాధిత మహిళకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. పార్టీ నాయకుడు కాబట్టి చర్యలు తీసుకోమంటే చూస్తూ ఊరుకోం. కిరణ్ రాయల్ తప్పు ఉందని విచారణలో తేలితే ఆందోళన చేపడతాం. బాధిత మహిళకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’’ అని ఆమె తెలిపారు.

ఇదీ చదవండి: జనసేన కిరణ్‌ రాయల్‌ బాగోతం.. వీడియో వైరల్‌

మరోవైపు,  కిరణ్‌ రాయల్‌ నీచుడు.. రాజకీయ ప్రతినిధిగా అనర్హుడు అంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు. మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్నాడు. కిరణ్‌ రాయల్‌ను జనసేన నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

 

 

 

 

 

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)