Breaking News

నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్‌ చాట్‌లో సంచలన విషయాలు

Published on Fri, 04/11/2025 - 17:10

సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరిలో సంచలనం రేపిన పరువు హత్య ఘటనలో మిస్టరీ వీడింది. చంద్రగిరి మండలం నరసింగాపురంలో నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో తల్లే నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. కూతురు నిఖిత ప్రేమ వ్యవహారం నచ్చకే ఆమె తల్లి సుజాత నిఖితను తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిఖిత తల్లి సుజాతను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

మిట్టపాళెనికి చెందిన అజయ్ అనే వ్యక్తిని 17 ఏళ్ల నిఖిత ప్రేమించింది. ఏడాది క్రితం కూతురు నిఖిత గర్భం దాల్చడంతో కడుపులోని బిడ్డను డెలివరీ చేసి మరి తల్లి సుజాత హత్య చేసినట్లు సమాచారం. నిఖిత తల్లిదండ్రులు పిర్యాదుతో అజయ్‌పై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు పంపారు. నాలుగు నెలల పాటు జైలులో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది.

బెయిల్ బయటకు వచ్చిన అజయ్‌ను మళ్లీ కలిసిన నిఖితపై కోప్పడిన తల్లి సుజాత.. గత శుక్రవారం నిద్రిస్తున్న కూతురిని చంపి గంటల వ్యవధిలో మృతదేహాన్ని కాల్చివేసింది. సాధారణ మరణంగా బంధువులను సుజాత నమ్మించింది. ఈ కేసులో సుజాతకు సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో వాట్సాప్‌ చాట్ ద్వారా నిజాలు వెలుగు చూశాయి. తనకు విషం పెట్టి చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ప్రియుడు అజయ్‌కు నిఖిత తెలిపింది. మా అత్త, అమ్మ, తాతయ్య విషం పెట్టీ చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ నిఖిత పేర్కొంది. వాట్సాప్‌ చాట్.. పోలీసులకు కీలక ఆధారంగా మారింది.

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)