Breaking News

తిరుపతిలో చారిత్రాత్మక, పురాతన కట్టడాల పరిరక్షణకు ముందడుగు

Published on Sat, 04/08/2023 - 15:51

సాక్షి,తిరుపతి: తిరుపతి నగరంలోని చారిత్రాత్మకమైన, పురాతన కట్టడాలను పరిరక్షించుకోవడం కోసం, భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం యువనేత భూమన అభినయ్ రెడ్డి ముందడుగు వేశారు. తిరుపతి 39వ డివిజన్, చెన్నారెడ్డి కాలనీలో ఓ పురాతనమైన కొలను ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు సేద తీరడం కోసం, స్నానాలు చేయడం కోసం ఈ కొలను నిర్మించారు. ఈ కొలనుకు కృష్ణంనాయుడి గుంటగా వాడుకలోకి వచ్చింది.

అయితే కాలక్రమేణా ఈ కొలను అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. 2018 టీడీపీ హయాంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భూమన కరుణాకర్‌ రెడ్డి చెన్నారెడ్డి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇందులో భాగంగా కృష్ణంనాయుడి గుంట కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని చెప్పిన విధంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి ఆ గుంటను అభివృద్ధి పరచడానికి కౌన్సిల్‌లో చర్చించారు. నిధులు మంజూరు చేసి మరమ్మతులు ప్రారంభించారు.


తాజాగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో పాటు పురాతన కట్టడాలను పరిరక్షించడం కోసం అడుగులు వేశామని భూమన అభినయ్ తెలిపారు. శ్రీకృష్ణంనాయుడి గుంట పరిరక్షణకు మొదటి విడతగా 57 లక్షలు మంజూరు చేసిన కౌన్సిల్, మలి విడతగా మరో 50 లక్షలను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. కొలనులో పూడికతీతతో పాటు ప్రహరీగోడ, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటి, సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)