Breaking News

సహ ఉద్యోగులే తోడేళ్లై.. చంద్రగిరిలో అరాచకం

Published on Thu, 06/19/2025 - 07:56

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాళెం సచివాలయంలో వెల్ఫేర్‌ ఆసిస్టెంట్‌ గుణశేఖర్‌ లైంగిక వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత ఉద్యోగినిపై సహోద్యోగులే తోడేళ్లై వేధించారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి వేధింపులు భరించలేక దళిత ఉద్యోగిని బుధవారం సచివాలయంలోనే బలవన్మరణానికి యత్నించారు.

బాధితురాలి కథనం ప్రకారం.. చంద్రగిరి మండలం మిట్టపాళెం సచివాలయంలో కొద్ది రోజులుగా వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ గుణశేఖర్‌ లైంగికంగా వేధిస్తుండడంతో తట్టుకోలేని దళిత ఉద్యోగిని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఆమె విధులకు హాజరు కాగానే కార్యాలయంలోని డిజిటల్‌ అసిస్టెంట్, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశావంటూ గొడవకు దిగారు. మర్యాదగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసి ఉద్యోగం లేకుండా చేస్తామంటూ భయపెట్టారు. కేసును వెనక్కు తీసుకుంటేనే సచివాలయంలోకి అనుమతిస్తామని హెచ్చరించారు.

దీంతో బాధితురాలు ఫోన్‌ ద్వారా ఎంపీడీఓకు సమాచారం అందించారు. మండల అధికారులు సచివాలయానికి చేరుకునే లోపే సహోద్యోగుల వేధింపులు భరించలేక దళిత ఉద్యోగిని నిద్రమాత్రలు మింగేసి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఆమెను మిగతా సిబ్బంది హుటాహుటిన 108 వాహనంలో చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అనిత ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. ఉద్యోగిని ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ అనిత తెలిపారు. ఇదిలా ఉంటే పత్రికల్లో వచ్చిన వార్తలపై వెల్ఫేర్‌ ఆసిస్టెంట్‌ గుణశేఖర్‌ విలేకరులపై బెదిరింపులకు పాల్పడ్డారు.  పరువునష్టం దావా వేస్తానని, కథ తేలుస్తానంటూ చిందులు తొక్కారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)