Breaking News

తిరుమల క్యూలో ప్రాంక్‌ వీడియో

Published on Fri, 07/12/2024 - 04:54

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రతలోని డొల్లతనం, సిబ్బంది నిర్లక్ష్యం బట్ట­బయలైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకుకెళ్లేందుకు అనుమతి లేనప్పటికీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి అక్కడి సిబ్బంది కళ్లుగప్పి ఏకంగా మొబైల్‌ఫోన్‌ తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఓ ప్రాంక్‌ వీడియోని చిత్రీకరించడం.. ఆ తర్వాత దానిని తన ఇన్‌స్ట్రాగాం పేజీలో పోస్టు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలివీ.. తమిళనాడుకు చెందిన ఓ వివాదాస్పద యూట్యూబర్‌ టీటీఎఫ్‌ వాసన్‌ ఇటీవల తన మిత్రులతో కలిసి మొబైల్‌ఫోన్‌తో దర్శన క్యూలోకి ప్రవేశించాడు.  

నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులతో తాళాలు తీస్తున్నట్లు నటించాడు. వాసన్‌ను చూసిన కంపార్టుమెంటులోని భక్తులు టీటీడీ ఉద్యోగిగా భావించి గేట్లు తీస్తారేమోనన్న భావనతో ఒక్కసారిగా పైకిలేవడంతో టీటీఎఫ్‌ వాసన్‌ వెకిలి నవ్వులు నవ్వుతూ పరిగెడుతూ రావడాన్ని తన మిత్రులు ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోలను టీటీఎఫ్‌ ఫ్యామిలీ అనే తన ఇన్‌స్ట్రాగాం పేజీలో వాసన్‌ పోస్ట్‌చేయడంతో తమిళనాడులో ఇది వైరల్‌ అయింది. దర్శన క్యూల్లో భక్తులపై ప్రాంక్‌ వీడియోల చిత్రీకరణపై తమిళనాడులో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకతాయి చేష్టలు చేసిన వాసన్‌ను అరెస్టుచేయాలని సామాజిక మాధ్యమాల్లో భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

విచారణకు టీటీడీ విజిలెన్స్‌ ఆదేశాలు..
ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్‌ వీడియోలు తీయడం హేయమైన చర్య అని ఒక ప్రకటనలో ఖండించింది. ప్రాంక్‌ వీడియోలు చిత్రికరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్‌ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించక ముందే భక్తుల నుండి మొబైల్‌ ఫోన్లు డిపాజిట్‌ చేసుకుంటారని టీటీడీ తెలిపింది. కానీ, ఒకరిద్దరు ఆకతాయిల చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)