Breaking News

తిరుమల రద్దీ .. సర్వదర్శనానికి 10 గంటలు

Published on Wed, 07/24/2024 - 09:02

తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (మంగళవారం)  73,332 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,202 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.73  కోట్లుగా లెక్క తేలింది.

జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదల..
జూలై 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్టు తెలిపింది. అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేయబడింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ తెలిపింది.

ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున తిరుమలలో వేంకటేశ్వరస్వామిని తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణ దర్శించుకున్నారు. 

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)