Breaking News

అమ్మా..ఊపిరాడలేదు!

Published on Fri, 04/18/2025 - 13:29

తిరుమల : ‘అమ్మా.. ఊపిరాడలేదు..!’ అన్నట్టు కారులో చిక్కుకుపోయిన ఆ చిన్నారుల ఆర్తనాదాలు అక్కడి వారిని కదిలించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన గురువారం తిరుమలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్‌ జిల్లా, బద్వేలుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుమలత దంపతులకు భాను (7), నీల (4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వెంకటసుబ్బారెడ్డి విదేశాల్లో ఉన్నారు.

సుమలత పిల్లలు, వెంకటసుబ్బారెడ్డి అన్న గంగయ్య అతని భార్య, అల్లుడితో కలిసి గురువారం తిరుమలకు బయలుదేరారు. తిరుపతి అలిపిరికి వచ్చిన అనంతరం సుమలత, గంగయ్య సతీమణి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. కారులో గంగయ్య, ఇద్దరు పిల్లలు, అల్లుడు తిరుమలకు చేరుకుని కారును స్థానిక వరాహస్వామి అతిథిగృహం–1 పార్కింగ్‌ ఏరియాలో పార్క్‌ చేశారు.  

కారులో లాక్‌ అయ్యారు! 
ఆ సమయంలో గంగయ్య పిల్లలు ఇద్దరినీ కారులో ఉంచి కారు డోర్లు లాక్‌ చేసుకుని బయటకు వెళ్లిపోయాడు. కొంతసేపటికి కారులో ఉన్న పిల్లలకు ఊపిరాడక ఏడుస్తున్నట్లు సమీపంలోని ట్యాక్సీ డ్రైవర్లు గుర్తించి తిరుముల ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సమీపంలోని ట్యాక్సీ డ్రైవర్ల సహాయంతో కారు అద్దాన్ని పగులకొట్టి తాళం ఓపెన్‌ చేసి కారులో ఉన్న ఇద్దరు చిన్నారులను బయటకు తీసి ప్రాణాలను కాపాడారు.

 అనంతరం ట్రాఫిక్‌ హోంగార్డు జయచంద్ర, పీఎసీజీ వెంకటేష్‌ ఆధ్వర్యంలో చిన్నారులను వన్‌ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. చిన్నారుల పెదనాన్న గంగయ్యపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లలను రక్షించిన పోలీసులకు తల్లి సుమలత ధన్యవాదాలు తెలిపారు. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్‌ రాజు స్పందించారు. పోలీసుల సమయస్ఫూర్తిని అభినందించారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)