Breaking News

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Published on Wed, 03/20/2024 - 09:21

సాక్షి, తిరుపతి : నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీవారి పుష్కరిణి లో తెప్పపై విహరించనున్నారు. 

తెప్పోత్సవం తొలిరోజు మార్చి 20న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి పుష్కరిణిలో తెప్పపై మూడు ప్రదక్షిణలు చేసి భక్తులను ఆశీర్వదిస్తారు. రెండో రోజు మార్చి 21న రుక్మిణి సమేతంగా కృష్ణస్వామి మూడుసార్లు తెప్పలపై విహరిస్తారు. మూడో రోజు మార్చి 22న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పుష్కరిణిలో మూడుసార్లు చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా మార్చి 23న నాలుగో రోజు ఐదుసార్లు, మార్చి 24న చివరి రోజు ఏడుసార్లు మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆర్జిత సేవలు రద్దు 
తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

శ్రీవారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం స్వామివారిని 63,251 మంది దర్శించుకున్నారు. వారిలో 20,989 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకతో స్వామివారి హుండీ ఆదాయం 4.14 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 

కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామి ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.  ఉచిత సర్వదర్శనానికి  6  గంటల సమయం.. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 గంటల సమయం పట్టనుంది. 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు