Breaking News

తిరుమల: రెండు నెలలకు 24న ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల

Published on Sat, 07/22/2023 - 08:32

తిరుమల: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల కోటాను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదనపు కోటా కింద నాలుగు వేల టికెట్లను విడుదల చేస్తుంది. అలాగే అక్టోబర్‌ నెలకు సంబంధించి రోజుకు 15,000 టికెట్లు చొప్పున విడుదల చేయనుంది. 

కాగా, ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు అక్టోబర్‌ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అక్టోబర్‌ నెలకు సంబంధించిన వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తుంది. భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

26న తిరుమలలో పల్లవోత్సవం..
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈ నెల 26న పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.  

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు క్యూలైన్‌ వెలుపల వేచి ఉన్నారు. ఈ  క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 

ఇది కూడా చదవండి: ‘ఆగస్టులో మెగా డీఎస్సీ హర్షణీయం’ 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)