Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

Published on Tue, 12/23/2025 - 09:40

పశ్చిమగోదావరి జిల్లా: ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అతివేగంతో రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో పోలమూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ (28), అంజిబాబు (25), రాజు (19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల కథనం ప్రకారం, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అర్ధరాత్రి  12.30 సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పెనుమంట్ర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతుండగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Videos

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

బాబూ... అప్పుడే ఎందుకు భయపడుతున్నావ్..? అతి దగ్గరలోనే!

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)