Breaking News

హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణం

Published on Tue, 07/07/2026 - 05:52

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆల­పాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురితో ప్రధాన న్యాయ­మూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్‌ ప్రమాణం చేయించారు. మొదట హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పార్థసారథి ముగ్గురు అద­నపు న్యాయమూర్తుల నియామకానికి సం­బంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. అనంతరం వారి ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తరువాత జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీతో కలిసి పురుషోత్తం కుమార్, జస్టిస్‌ బట్టు దేవానంద్‌తో కలిసి గంధం సునీత, జస్టిస్‌ దొనడి రమేష్‌తో కలిసి ఆలపాటి గిరిధర్‌ కేసులను విచారించారు. 

హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయ­మూర్తులకు గాను.. ప్రస్తుతం 29 మంది ఉన్నారు. ఈ ముగ్గురి నియామకంతో న్యాయ­మూర్తుల సంఖ్య 32కి చేరింది. ఈ కార్య­క్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో­పాటు రిజిస్ట్రార్లు, అదనపు న్యాయమూ­ర్తు­లుగా ప్రమాణం చేసిన వారి కుటుంబ సభ్యు­లతో­పాటు అదనపు సొలిసిటర్‌ జనరల్‌­(ఏఎస్‌జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అద­నపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌­(పీపీ) మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, న్యాయవాదులు పాల్గొ­న్నారు. అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన ముగ్గురిని పలువురు న్యాయ­వాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  

Videos

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)