Breaking News

కిడ్నీ రాకెట్‌ కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్‌

Published on Sun, 04/30/2023 - 10:47

సాక్షి, విశాఖపట్నం: కిడ్నీ రాకెట్‌ కేసును వైజాగ్‌ పోలీసులు ఛేదించారు. కిడ్నీ రాకెట్‌ కేసుకు సంబంధించి పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఇక, ఈ ముఠా.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, కిడ్నీ రాకెట్‌లో ఆపరేషన్‌ చేసిన డాక్టర్లపై పోలీసులు దృష్టిసారించినట్టు తెలిపారు. ఈ కేసులో ఇంకా అరెస్టులు పెరిగే అవకాశముందని పోలీసులు స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. కిడ్నీ రాకెట్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఈ ఉదంతంపై విచారణ వేగవంతం చేశారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కాగా, పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జీవన్‌దాన్‌ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బు ఆశ చూపించి గత ఏడాది డిసెంబర్‌ 16వ తేదీన మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్‌కుమార్‌కు పెందుర్తి తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

ఆస్పత్రి సీజ్.. 
తిరుమల ఆసుపత్రిలో వైద్య సే­వ­లు, సౌకర్యాలపై అధికారులు  కలెక్టర్‌ మల్లికార్జునకు అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ఆస్పత్రిని సీజ్‌ చే­యా­లని  ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, పెందుర్తి తహసీల్దార్‌  సమక్షంలో ఆస్పత్రిని సీజ్‌ చే­శారు. మోసం, మానవ అవయ­వాల మార్పిడి చట్టం 1995, ఐపీసీ 18, 19తో పాటు 420 ఆర్‌/డబ్ల్యూ 120(బీ) కింద కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్‌ మాట్లాడారు

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)