Breaking News

సీఎం చంద్రబాబు ఇలాకాలో దారుణం

Published on Tue, 06/17/2025 - 04:54

కుప్పం రూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కుప్పం మండలం నారాయ­ణపురంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుప్పం మండలం నారాయ­ణపురం గ్రామా­నికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు.

తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో తిమ్మరాయప్పఊరొదిలి వెళ్లిపోయాడు. ఆయన భార్య శిరీష ఇద్దరు బిడ్డలతో కలిసి గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తనకు వచ్చిన కూలి డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తోంది. పెద్దమొత్తం కావడంతో మునిక­న్నప్పకు అప్పు తీర్చలేక­పోయింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప వేధింపులు ఎక్కువయ్యాయి.

సోమ­వారం శిరీష రోడ్డుపై నడిచి వెళ్తుండగా తక్షణమే అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగా అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా శిరీషను నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేపచెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు గ్రామానికి చేరుకుని శిరీషకు కట్లు విప్పి వివరాలు సేకరించారు. టీడీపీ కార్యకర్త  మునికన్నప్పను అదుపులోకి తీసుకుని బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 341/323/324/506/34 కింద కేసు నమోదు చేశారు.

కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యం: ఎమ్మెల్సీ భరత్‌
కుప్పంలో లా అండ్‌ ఆర్డర్‌ విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్‌ మండిపడ్డారు. ‘‘కుప్పంలో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళపై ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లాడు ఏడుస్తున్నా కూడా కనికరించలేదు. నారాయణపురంలో ఈ అనాగరిక ఘటన జరిగింది. కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యం చేస్తోంది. పోలీసులు కూడా బాధితులపైనే కేసులు పెడుతున్నారు. కుప్పంలో మహిళా అధికారులకు కూడా భద్రత లేదు’’ అని భరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మహిళను చెట్టుకు కట్టేసి అవమానించిన టీడీపీ కార్యకర్త

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)