Breaking News

ఒంగోలు రిమ్స్‌ వద్ద ఉద్రిక్తత.. వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

Published on Sat, 11/09/2024 - 13:08

ప్రకాశం, సాక్షి: ఒంగోలు రిమ్స్‌ వద్ద ఉద్రక్తత చోటుచేసుకుంది. లైంగిక దాడికి గురైన మైనర్ బాలికను పరామర్శించేందుకు మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ , పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ వెంకయ్య , వరికూటి అశోక్ బాబు రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు.ఈ క్రమంలో వారిని రిమ్స్ ఆస్పత్రిలోకి  వెళ్లకుండా పోలీసులు  అడ్డుకున్నారు.   

దీంతో పోలీసులు వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ  ఆదిమూలపు సురేష్, వెంకయ్య, అశోక్ బాబు అక్కడే నేలపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు.   అనంతరం బాలిక తల్లిదండ్రులుతో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. టంగుటూరు మండలం కారుమంచిలో నాలుగో తరగతి విద్యార్థినిపై  స్కూల్ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి  పాల్పడిన  ఘటన ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 

అనంతరం మాజీ మంత్రి ఆదిమూలపు  సురేష్ మీడియాతో మాట్లాడారు. ‘‘ టంగుటూరు మండలం కారుమంచి మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన చాలా దారుణం. రాష్ట్రంలో పిల్లలు, మహిళలకు రక్షణ లేదు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నాయి. ‘దిశ’ను ఎందుకు నీరు గార్చారు. పోలీసులు ఎందుకు నిర్లప్తంగా  తయారయ్యారు. 

...కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాకుండా ఎందుకు వదిలేశారు. బాధితురాలు.. తనపై హత్యాచారం చేశారని చెబుతుంటే. ఇంకా ఎన్ని రోజులు విచారణ జరుపుతారు. ఏ మంత్రి చెబితే కేసుని తొక్కిపట్టారు?. మేం వచ్చే వరకు పిర్యాదు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ అరచకాలపై సోషల్ మీడియా ద్వారా ఎండగడుతాం?. అలాగే సోషల్ మీడియాపై నిర్బంధాన్ని ఎదుర్కుంటాం. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వుంటాం’’ అని అన్నారు.

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)