Breaking News

బాబు మార్క్‌ పాలన.. సీఎం బంధువుకు దక్కలేదని టెండర్‌ రద్దు

Published on Sun, 04/27/2025 - 09:18

సాక్షి, అమరావతి: అస్మదీయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి కమీషన్ల రూపంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని దండుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. కనీస అనుభవం, అర్హతలేని సంస్థలకు రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లను అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల బంధువులు, సన్నిహితులు, కమీషన్లు ముట్టజెప్తే కంపెనీలకు కాంట్రాక్ట్‌ దక్కని పరిస్థితుల్లో ఏకంగా టెండర్లనే రద్దు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్‌ టెండర్లలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.

చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన సంస్థ
2014–19 మధ్య అధికార బలంతో సీఎం బంధువు దేవదాయ, వైద్య శాఖల్లో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారు. పనులు సక్రమంగా చేయకపోయినప్పటికీ సీఎం బంధువు కావడంతో అధికారులు సైతం నోరెత్తకుండా అడ్డగోలుగా బిల్లులు చేశారు. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం బంధువు కంపెనీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కూడా దేవదాయ, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్‌లపై సీఎం బంధువు కన్నేశారు. కొద్దినెలల క్రితం ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ పనుల కోసం టెండర్లు పిలవగా.. బిడ్‌ దాఖలు చేయడంతో పాటు, సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు సదరు కంపెనీ సిఫార్సు చేయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, పరిశీలన దశలోనే బిడ్‌ అనర్హతకు గురైంది. దీనికి తోడు వివిధ మార్గాల్లో ప్రభుత్వ పెద్దలతో డీల్‌ కుదుర్చుకున్న సంస్థలకు పనులు దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో కోర్టు కేసులు, వివాదాలు, ఇతర కారణాలను బూచిగా చూపి మొత్తం టెండర్‌నే ప్రభుత్వం రద్దు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కుట్ర బట్టబయలు
డీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్‌ కంట్రోల్‌ నిర్వహణకు ఒకేసారి టెండర్లు పిలిచారు. కాగా, ఒక్క శానిటేషన్‌ టెండర్లనే ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌ టెండర్ల ప్రక్రియలోనూ అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. సెక్యూరిటీ విభాగంలో ఒక సంస్థ టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా తక్కువకు ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు చేసింది. నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు చేస్తే రద్దు చేస్తామని టెండర్‌ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

అయినప్పటికీ ఈ సంస్థ బిడ్‌ను ప్రభుత్వం తిరస్కరించలేదు. కోర్టు కేసులు, బ్లాక్‌ లిస్ట్‌ అయిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని, వారికి పనులు కట్టబెట్టకుండా చూడాలని కోర్టులో కేసులు దాఖలయ్యాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే పెస్ట్‌ కంట్రోల్‌ విభాగంలో సాయి సెక్యూరిటీ అనే సంస్థపై చీటింగ్‌ కేసు నమోదైంది. కాగా, ఆయా సంస్థలన్నీ అమాత్యుడు, ఇతర ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ముట్టజెప్పేలా డీల్‌ కుదుర్చుకోవడంతో ఈ పనుల వరకూ కాంట్రాక్టర్ల ఎంపిక ముగించేశారు. కుంటి సాకులతో ఒక్క శానిటేషన్‌ టెండర్లను రద్దు చేయడంతో ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలైంది. 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)