Breaking News

జీవో1 అమలు తాత్కాలికంగా నిలుపుదల

Published on Fri, 01/13/2023 - 04:15

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, రోడ్‌ మార్జిన్‌లలో సభలు, రోడ్‌షోలను నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 1 అమలును హైకోర్టు తాత్కాలికంగా ఈ నెల 23వ తేదీ వరకు నిలిపివేసింది. ఈ జీవో పోలీసు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ­మూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

జీవో 1ని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కాకు రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై గురువారం మధ్యాహ్నం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జీవో  పోలీసు చట్ట నిబంధనలకు విరుద్ధమని రామకృష్ణ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్‌ చెప్పారు. తరువాత అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. 10 రోజుల కిందట ఇచ్చిన జీవోపై ఇప్పుడు ఈ వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపేందుకు వీలుగా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని తెలిపారు.

ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారణ జరిపే పరిధి వెకేషన్‌ కోర్టుకు లేదన్నారు. సభలు, రోడ్‌షోల కోసం ఏ పార్టీ దరఖాస్తు చేయడం గానీ, తాము అనుమతులు నిరాకరించడం గానీ జరగలేదన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ స్పందిస్తూ.. ‘పోలీసు చట్టం 1861 అమల్లోకి తెచ్చారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఇలాంటి జీవో తెచ్చి ఉంటే స్వాతంత్య్రోద్యమం జరిగేదా? స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి జీవో రాలేదు.

ఈ వ్యాజ్యం విచారణకు రాకుండా చేసేందుకు తెర వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. హైకోర్టు వ్యవహారాలను థర్డ్‌పార్టీ నడిపిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఏజీ వాదనలను కొనసాగిస్తూ.. జీవోలో నిషేధం అన్న పదమే లేదని తెలిపారు. నెల్లూరు, గుంటూరుల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే పోలీసులకు పలు సూచనలు చేస్తూ జీవో 1 జారీ చేశామన్నారు. సభలు, రోడ్‌షోల నిషేధానికి కాదని చెప్పారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)