Breaking News

రాష్ట్రంలో దంచికొట్టనున్న ఎండలు..ఇప్పటికే పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా నమోదు

Published on Mon, 04/10/2023 - 07:42

సాక్షి, అమరావతి/గోనెగండ్ల:  రాష్ట్రంలో సోమవా­రం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులు రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఆదివారమే అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో 41.9 డిగ్రీలు, చింతూరులో 41.5, కూనవరంలో 40.1, తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 41.9, కోరుకొండలో 40.3, రాజమండ్రిలో 40.6, రాజానగరంలో 40.7, ఏలూరు జిల్లా భీమడోలులో 41.6, ద్వారకా తిరుమలలో 41.2, కాకినాడ జిల్లా శంఖవరంలో 40.3, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి, ముమ్మిడివరంలో 41.8, నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 40, పగిడ్యాలలో 40.5, పల్నాడు జిల్లా నకరికల్లులో 40, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 41.2, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 41.2, జరుగుమిల్లిలో 40.6, శ్రీకాకుళం జిల్లా బుర్జలో 40, కోటబొమ్మాళిలో 40.4, లక్ష్మీనరసుపేటలో 40.2, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో 41.3, వరికుంటపాడులో 41, విజయనగరం జిల్లా కొత్తవలసలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు.

ఎండవేడికి పగిలిపోయిన కొండరాయి..
మరోవైపు.. అధిక ఉష్ణోగ్రతతో కర్నూలు జిల్లా గోనెగండ్లలోని నరసప్ప దేవాలయం దగ్గర ఉన్న పెద్ద కొండరాయి రెండుగా చీలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా వచ్చి పరిశీలించారు. కొండరాయి పగిలిన దగ్గర నుంచి పొగలు రావడం, రాయి చిన్నచిన్న ముక్కలుగా పడిపోతుండటాన్ని గమనించారు. ఎండ  ఎక్కువగా ఉండటంతో కొండరాయి పగిలిందని తహసీల్దార్‌ కార్యాలయ  సిబ్బంది చెప్పారు.
చదవండి: 1991లో ఒకటి.. ఇప్పుడు నిమిషానికి 175.. యాక్టివ్‌గా ఉన్నది 18 శాతం మాత్రమే!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)