Breaking News

‘తెలుగు వికీపీడియా పండగ-2025’ విజయవంతం

Published on Mon, 02/17/2025 - 13:35

సాక్షి,తిరుపతి: తిరుపతిలో ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో నిర్వహించిన "తెలుగు వికీపీడియా పండగ 2025" ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 50 మందికి పైగా తెలుగు వికీపీడియా సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, 2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా ఇప్పటివరకు లక్షకుపైగా వ్యాసాలను కలిగి ఉండడం విశేషం.

సదస్సు సందర్భంగా "తెలుగు వికీపీడియాను విస్తరించే మార్గాలు", "సభ్యుల వ్యాస రచనా నైపుణ్యాల మెరుగుదల", "వ్యాసాలను ప్రజలకు మరింత ఆసక్తికరంగా రూపొందించే పద్ధతులు" వంటి కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. అదనంగా, "తెలుగు వికీపీడియాలో చేరండి.. అందరికీ విజ్ఞానం పంచండి" అనే నినాదంతో తిరుపతి నగర వీధుల్లో వికీపీడియా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను పంచి ప్రజలకు వికీపీడియాపై అవగాహన కల్పించారు.

"తెలుగు వికీపీడియా బడి" పేరుతో త్వరలో ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కొత్త సభ్యులు వీటి ద్వారా వికీపీడియాలో భాగస్వాములు కావచ్చని తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో తెలుగు వికీపీడియాకు విశేష సేవలు అందించిన వారిని ఈ వేడుకల్లో సత్కరించారు. ఉత్తమ నిర్వాహకుడిగా యర్రా రామారావు సత్కారం పొందారు. వికీ పునస్కార  గ్రహీతల్లో ఎన్‌.ఆర్. గుళ్ళపల్లి, శ్రీరామమూర్తి, బత్తిని వినయ్ కుమార్ గౌడ్, స్వరలాసిక, టి. సుజాత, రవిచంద్ర, రామేశం, ఐ. మహేష్, బి.కె. విశ్వనాధ్ తదితరులున్నారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)