Breaking News

కొలికిపూడితో విసిగిపోయాం

Published on Mon, 10/07/2024 - 05:38

సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరు­వూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ వైఖరితో విసిగిపోయామని, ఆయనతో కలిసి పనిచేయలేమని టీడీపీ సీనియర్లు తేలి్చచెప్పారు. తిరువూరు నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఆదివా­రం తిరువూరులో జరిగింది. అధిక శాతం నాయకులు సమావేశాన్ని బహిష్కరించడంతో పార్టీ పొలి­ట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, విజయ­వాడ ఎంపీ కేశినేని చిన్ని కంగుతిన్నారు.

ఎమ్మెల్యే­ని వ్యతిరేకిస్తున్న నాయకులతో లక్ష్మీపురం మనో గార్డెన్స్‌లో సమావేశం ఏర్పాటు చేసి బుజ్జగించేందుకు ప్రయత్నించగా.. నాయకులెవరూ వెనక్కి తగ్గలేదు. పార్టీ శ్రేణులతో సమన్వయ లేమి, నాయకులను సైతం దూషించే ఎమ్మెల్యేతో పనిచేసేది లేదని తెగేసి చెప్పారు. టీడీపీ నేతలపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టి­ం­చడం, వేధింపులకు గురిచేయడంతో తాము అభద్ర­తా భావానికి లోనవుతున్నామని, ఎన్నికల్లో కష్టపడి గెలిపించిన తమకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం 
కాగా.. తిరువూరు టీడీపీ నేతలను సమన్వయం చేసే­ందుకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమి­టీ ఏర్పాటు చేస్తామని పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ఎంపీ చిన్ని, వర్ల రామ­య్య హామీలతో సంతృప్తి చెందని నాయ­కులు నియో­జకవర్గ పార్టీ సమావేశాన్ని బహిష్కరిస్తున్న­ట్టు ప్రకటించి వెళ్లిపోయారు. కాగా.. తన భార్యను ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చిట్టేల సర్పంచ్‌ తుమ్మలపల్లి శ్రీనివాసరావు తన అనుచరులతో చిట్టేలలో నిరసనకు దిగారు. ఎమ్మెల్యే వేధింపులతో తన భార్య ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల్లో ఉందని, ఈ విష­యమై తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యా­దు చేసినా స్పందించలేదని వాపోయారు.  

 

Videos

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)