Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో లోకేష్‌ అనుచరుడికి రిమాండ్‌

Published on Tue, 07/14/2026 - 10:01

విశాఖపట్నం: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకే‹Ùకు అత్యంత సన్నిహితుడైన యువ నేత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ దందాలో అడ్డంగా దొరికిపోయారు. జీవీఎంసీ 51వ వార్డు టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న పేడాడ మణికంఠ, మంత్రి లోకేష్‌కు అత్యంత ఆప్తుడనే ప్రచారం చేసుకుంటూ బెట్టింగ్‌ సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. 

గత కొద్ది రోజులుగా మణికంఠ తన అనుచరుడు శాంతి స్వరూప్‌తో కలిసి మాధవధార సీతన్న గార్డెన్స్‌ వేదికగా ఈ ఆన్‌లైన్‌ జూదాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆదివారం సాయంత్రం ఆ శిబిరంపై దాడి చేసి వీరిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరు ఆడటంతో పాటు మరో 15 మందితో పెద్ద ఎత్తున బెట్టింగులు ఆడిస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో సోమవారం వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. 

పోలీసుల గోప్యత? 
అరెస్ట్‌ అయిన వ్యక్తి మంత్రి లోకేష్‌ కు అత్యంత సన్నిహితుడు కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని నొక్కిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులను రిమాండ్‌కు తరలించినా కూడా వివరాలు బయటకు పొక్కకుండా గుట్టుగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులను వివరణ అడిగినప్పటికీ వివరాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)