Breaking News

రిగ్గింగ్‌.. బూత్‌ క్యాప్చరింగ్‌.. దొంగ ఓట్లతో గెలిచారు

Published on Wed, 03/05/2025 - 05:49

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియో­జ­కవర్గంలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్, బూత్‌ క్యాప్చ­రింగ్, దొంగ ఓట్లతో గెలిచిందని ఆ ఎన్నికలో ఓటమి పాలైన పీడీఎఫ్‌ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావు ఆరోపించారు. ఒక సీటు కోసం ఈ స్థాయికి టీడీపీ దిగజారిపోతుందని ఊహించలేదన్నారు. మంగళవారం ‘సాక్షి ప్రతి­నిధి’తో లక్ష్మణరావు మాట్లాడుతూ.. దొంగ ఓట్లు గణనీయంగా పని చేశాయన్నారు. 

ఆలపాటి పేరుకు ముందు వేసిన ఒకటి అనే అంకె దాదాపు 50కిపైగా బ్యాలెట్‌ పత్రాలపై ఒకేలా కనబడిందని, ఈ ఓట్లన్నీ ఒక్కరే వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో 91 శాతం, దాచేపల్లిలో 88 శాతం, వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 80% కంటే ఎక్కువ ఓట్ల శాతం నమోదయ్యాయన్నారు. గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా జిల్లాలోని పలుచోట్ల, ఏలూరు జిల్లా­లోని కైకలూరు, నూజివీడులలో దొంగ ఓట్లు, బ్యూత్‌ క్యాప్చరింగ్‌లు జరిగాయని ఆరోపించారు. నూజివీడులో ముందు రోజున ఓటర్లకు వాల్‌­క్లాక్‌లు పంపిణీ చేసిన సంగతి గుర్తు చేశారు. 

రిగ్గింగ్‌కు పాల్పడ్డారు
పలు పోలింగ్‌ బూత్‌లలో టీడీపీ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని లక్ష్మణరావు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో పీడీఎఫ్‌ తరఫున ఏజెంట్‌ను కూడా కూర్చొనివ్వలేదని చెప్పారు. దుర్గిలో గంటలోపే ఏజెంట్‌ను బయటకు నెట్టేశారన్నారు. బెల్లంకొండలో ఏజెంట్‌ను బయటకు లాక్కొచ్చి అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారని, తాను అమరా­వతి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లినప్పుడు ఆ కేంద్రం గేటు వద్ద 200 మంది టీడీపీ నేతలు టెంట్‌లో ఉన్నా­రని, వారంతా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశా­రని పేర్కొన్నారు. 

అనేకచోట్ల ఎమ్మెల్యేలు బూత్‌ల­లోకి వెళ్లి అక్కడ చాలా సమయం గడిపి ఓటింగ్‌ను ప్రభావితం చేశారన్నారు. ఎన్నికలు సజావుగా జర­గ­లేదని, అధికార పార్టీ తన పరపతిని ఉపయోగించి ఓటింగ్‌ను ప్రభావితం చేసిందన్నారు.  జరిగిన అక్రమాలపై ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. డిగ్రీ చదవని వారిని కూడా పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించారన్నారు. 

భారీ ఎత్తున దొంగ ఓట్లు సైతం వేయించారన్నారు. ఓటువేసే సమ­యంలో గుర్తింపు కార్డు చూపించకుండానే ఓటర్లను లోపలికి అనుమతించారని ఆరోపించారు. పెనమ­లూరు వద్ద ఒకే పేరుతో 42 ఓట్లు, మరో­చోట ఒకే పేరుతో 10 ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. తెనాలిలోని కోగంటి శివయ్య స్కూల్‌ వద్ద కూడా ఇదేవిధంగా జరిగిందని, దీనిపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారనన్నారు. 

ఒక ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రా­నికి వెళితే ఓ సీఐ ‘సర్‌.. మీరు వెళ్లండి. ఇక్కడ అంతా మేం చూసుకుంటాం’ అని చెప్పిన విష­యాన్ని రికార్డు చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అనైతికంగా సోషల్‌ మీడియాలో చివరి నాలుగు రోజులు విపరీతమైన దుష్ప్రచారం చేశారని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు.  

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)