Breaking News

ఎంపీపీకి టీడీపీ బెదిరింపులు

Published on Sun, 07/28/2024 - 05:18

చిలమత్తూరు: ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా, అధికారం బలంతో ఎంపీపీ పదవి చేజిక్కించుకొనేందుకు టీడీపీ నీచ రాజకీయానికి దిగింది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు ఎంపీపీని బెదిరించి, అధికార బలాన్ని ఉపయోగించి, ఆయన మండల సమావేశంలో పాల్గొనకుండా అడ్డుకొంది. రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేసింది. శనివారం జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయించింది. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి, 144 సెక్షన్‌ విధించి, భారీ సంఖ్యలో కార్యకర్తలతో హంగామా సృష్టించింది. 9 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను బలవంతంగా టీడీపీలో చేర్చుకొంది.

ఈ ఎంపీటీసీల బలంతో ఎంపీపీ పదవిని చేజిక్కించుకొనేందుకు ఎత్తులు వేస్తోంది. ఒక్క ఎంపీటీసీ కూడా గెలవని టీడీపీ.. చిలమత్తూరు ఎంపీపీ పదవి కోసం పోలీసులను ఉపయోగించింది. ఇందుకోసం ఎంపీపీ పురుషోత్తంరెడ్డిని లక్ష్యంగా చేసుకొంది. ఆయన్ని పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసింది. సమావేశానికి హాజరైతే రౌడీïÙట్‌ తెరిపించి జిల్లా బహిష్కరణ చేస్తామని పోలీసులు, టీడీపీ నేతలు బెదిరించినట్టు సమాచారం. దీంతో  శనివారం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొనాల్సిన పురుషోత్తమరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయినట్లు సమాచారం. 

ఎంపీపీ లేకపోవడంతో మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్టు ఎంపీడీవో ప్రకటించారు. సర్వసభ్య సమావేశం సందర్భంగా గొడవలు జరుగుతాయంటూ పోలీసులు 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చారు. అయితే దాని ప్రభావం ఎక్కడా కనిపించలేదు. వందలాది టీడీపీ కార్యకర్తలు, నాయకులు మండల కేంద్రంలో హల్‌చల్‌ చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. అయినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. 

టీడీపీలో లుకలుకలు 
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను చేర్చుకోవడంతో టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండా ఎలా పార్టీల్లో చేర్చుకుంటారంటూ ఆ పంచాయతీల్లోని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ పదవి పైనా టీడీపీలో నాగరాజు యాదవ్, రంగారెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారు ఎంపీపీ పదవిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తమ పారీ్టలోకి వచి్చన ఎంపీటీసీలను వారి శిబిరాల్లో చేర్చుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)