టీడీపీ కనుసన్నల్లోనే ‘సర్‌’

Published on Tue, 07/14/2026 - 06:02

పిడుగురాళ్ల/నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ‘సర్‌’ కార్యక్రమం అపహాస్యం పాలవుతోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ తంతు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను నమోదుచేసేందుకు బీఎల్‌ఓలు సైతం ముందుకురాకపోవడంతో స్థానిక ఓటర్లు ఆందోళన వ్యక్తంచేశారు. సర్‌ ప్రక్రియకు ఇక సోమవారం ఒక్కరోజే గడువు మిగిలి ఉండడంతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను నమోదుచేసేందుకు బీఎల్‌ఓలు నానుస్తున్నారు. దీంతో కరాలపాడు ఓటర్లు, బీఎల్‌ఏలు అందరు కలిసి పిడుగురాళ్ల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బైఠాయించారు.

 గ్రామ ఇన్‌చార్జి ఆర్‌ఐ శ్రీనిబాబు, ఐదుగురు బీఎల్‌ఓలు గ్రామానికి వచ్చి విధులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు మా గ్రామానికి వస్తేనే ఇక్కడ నుంచి కదులుతామని తేల్చిచెప్పడంతో గత్యంతరంలేక ఆర్‌ఐ శ్రీనిబాబుతోపాటు బీఎల్‌ఓలు కరాలపాడు గ్రామానికి స్థానికుల వెంట వెళ్లారు. అయినప్పటికీ టీడీపీ సానుభూతిపరుల­వి మాత్రమే నమోదుచేస్తుండడంతో అధికారులపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.  

కలెక్టర్‌కు కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు.. 
ఈ నేపథ్యంలో.. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ కృతిక శుక్లాకు ఫిర్యాదు చేశారు. దీంతో కోనంకి, కరాలపాడు గ్రామంలో పూర్తిస్థాయిలో సర్‌ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్‌ గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్‌ మధుబాబులను ఆదేశించారు. ఈలోగా పోలీసులు కరాలపాడు సచివాలయం వద్దకు చేరుకుని టీడీపీ సానుభూతిపరులవి మాత్రమే బీఎల్‌ఓ ద్వారా దగ్గరుండి ఆన్‌లైన్‌ చేయిస్తున్నారు. తమను సచివాలయంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు ఆరోపించారు. 

అలాగే, కోనంకి గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను ఆన్‌లైన్‌ చెయ్యొద్దని తహసీల్దార్‌ బీఎల్‌ఓలకు ఆన్‌లైన్‌ లాగిన్‌ ఇవ్వలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు నమోదుచేయాలన్న లక్ష్యంతో సర్‌ ప్రక్రియ నిర్వహిస్తుంటే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను ఆన్‌లైన్‌లో నమోదుచేయకుండా ఉన్నతాధికారులే అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ మధుబాబును వివరణ కొరేందుకు ప్రయతి్నంచినా ఆయన అందుబాటులోకి రాలేదు.   

మూడ్రోజుల ముందే ఆపేశారు: కాసు 
మరోవైపు.. నరసరావుపేటలో కలెక్టర్‌ను కలిసిన అనంతరం కాసు మహేష్ రెడ్డి మీడియాతో మా­ట్లాడారు. నిబంధనల ప్రకారం ఈనెల 14 సా­యంత్రం వరకు ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకు­ని డిజిటలైజ్‌ చేయాల్సి ఉన్నా మూడ్రోజుల ముందే కరాలపాడు, కోనంకి గ్రామాల్లోని బీఎల్‌ఓలు, ఎన్నికల అధికారులు ఓటర్ల దగ్గర నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకోవడం నిలిపివేశారని చెప్పారు. దీన్ని తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)