Breaking News

‘అనంత’లో టీడీపీ దౌర్జన్యకాండ

Published on Fri, 06/07/2024 - 05:34

అనంతపురం: ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కార్యకర్తలు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తున్నారు. గురువారం కూడా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు. ఉరవకొండలోని కణేకల్లు క్రాస్‌ వద్ద హోటల్‌లో బుధవారం టీ తాగుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఒక్కసారిగా తల, కాళ్లు, చేతులపై కర్రలతో దాడి చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే బందోబస్తులో ఉన్న స్పెషల్‌ పార్టీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.

శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యురాలు ఆశాబీ ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు చొరబడి ఆమె కుమారులు అక్బర్, ఇర్ఫాన్‌లపై దాడి చేశారు. చిలమత్తూరు మండలంలోని వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్దకు టీడీపీ కార్యకర్తలు వెళ్లి దాడులకు తెగబడ్డారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త నరసింహమూర్తిపై దాడి చేసి, తల పగుల­గొట్టారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్య­కర్త నాగభూషణం ఇంట్లో చొరబడి దాడికి యత్నించారు.

తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆత్మకూరు మండలం గొరిదిండ్లలో దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బొమ్మనహాళ్‌ మండలం దేవగిరి­లో సచివాలయం ఆర్చ్‌పై ఉన్న వైఎస్సార్‌ బొమ్మ­ను ధ్వంసం చేశారు. సచివాలయం, రైతు భరోసా శిలా ఫలకాలను ధ్వంసం చేసేందుకు యతి్నంచగా స్థానికులు అడ్డుకున్నారు. ఉప్పరపల్లిలో సచివాల­యం, ఆర్‌బీకే బోర్డులను ధ్వంసం చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)