Breaking News

మా ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు.. కలెక్టర్‌కు టీడీపీ కార్యకర్త ఫిర్యాదు

Published on Tue, 07/08/2025 - 09:02

సాక్షి, విజయనగరం అర్బన్‌: ఏపీలో కూటమి పాలనలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ పాలనపై సొంతపార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా విజయనగరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పూస­పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు బిగ్‌ షాక్‌ తగిలింది. వారి పాలన బాగాలేదంటూ నగరంలోని 28వ వార్డు రాజీవ్‌నగర్‌ కాలనీ టీడీపీ సీనియర్‌ కార్యకర్త తీగల ఆనందరావు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. తమ కాలనీలోని సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ సమస్యలపై ఏడాదిగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించలేదన్నారు. కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు మరమ్మతులు చేయాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, సచివాలయ కార్యాలయానికి ప్రభుత్వ భవనం నిర్మించాలని, ప్రభుత్వాసుపత్రి నిర్వహణపై దృష్టిసారించాలని, పార్కులు అభి­వృద్ధి చేయాలని, వీధి దీపాలు అమర్చాలని, రేష­న్‌ డిపోను ఏర్పాటు చేయాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. అందుకే, తమ కాలనీ సమస్యలను బ్యానర్‌ రూపంలో ప్రదర్శిస్తూ కలెక్టర్‌కు విన్నవించినట్టు తెలిపారు. ప్ర­జ­ల సమస్యలను పట్టించుకోని ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)