Breaking News

అయ్యా లోకేశ్‌.. నా గోడు పట్టదా!

Published on Wed, 09/24/2025 - 08:02

సాక్షి, నెల్లూరు సిటీ: సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ టీడీపీ నాయకులు, కార్యకర్తలను పూర్తిగా వాడుకుని వదిలేస్తా­రని అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడి జీవితం కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. టీడీపీని నమ్ముకుని ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డానని నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కంచి మల్లికార్జునరెడ్డి తెలిపారు.

‘1983లో పార్టీ స్థాపించినప్పటి నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశాను. పార్టీ కోసం నా జీవితాన్ని, ఆస్తులను త్యాగం చేశాను. ఈ రోజు బతుకుదెరువు కోసం పార్టీ నేతలను, స్థానికులను యాచించాల్సిన దుస్థితి వచ్చింది’ అని మల్లికార్జునరెడ్డి ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.  

లోకేశ్‌ పేరుతో సేవా కార్యక్రమాలకు రూ.కోట్లు ఖర్చు..
‘నేను 2014లో నారా లోకేశ్‌ సేవా సమితిని ఏర్పాటు చేశాను. రూ.కోట్లు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాను. అప్పట్లో పవర్‌ ప్రాజెక్ట్‌లకు ఐస్‌ సరఫరా కాంట్రా­క్ట్‌ చేసేవాడిని. నేను సంపాదించిన డబ్బులతోపాటు 2 ఇళ్లు, ఇంటి స్థలం అమ్మేసి లోకేశ్‌ సేవా సమితి కార్యక్రమాలకు ఖర్చు చేశాను. రూ.1.50లక్షలు ఖర్చు చేసి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు, తల్లి అమ్మణ్ణమ్మల పెయింట్‌ ఫొటో వేయించాను. ఆ ఫొటోను చంద్రబాబు­కు బహూకరించాను. 

గతేడాది డిసెంబర్‌లో షుగర్‌ పెరిగి నాకు ఒక కాలు తొలగించారు. తల నరాలు బలహీనపడి  నా భార్య అనార్యోగంతో బాధపడుతోంది. దివ్యాంగుల పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు.’ అని చెప్పారు.  ‘ఇటీవల నెల్లూరు వచి్చన లోకేశ్‌ను కలిశాను. నా పరిస్థితిని వివరించ­డంతో అధైర్య పడొద్దు.. మంత్రి నారాయణకు చెప్పాను. ఆ­యన చూసుకుంటారని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరూ సాయం చేయలేదు. నా జీవితాన్ని పారీ్టకి అంకితం చే­శా­ను. నన్ను ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం’ అని అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)