Breaking News

మాజీ సీఎం జగన్‌ చిత్రం తొలగింపు

Published on Tue, 08/13/2024 - 11:39

కరప: పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆ ఏడాది అక్టోబర్‌ నెల 2 గాంధీ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థను కరప నుంచి ఆయన లాంఛనంగా ప్రారంభించి, పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరప గ్రామసచివాలయం–1 వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌కు నీలం, తెలపు, ఆకుపచ్చ రంగులు వేసి, పైభాగంలో నాలుగుపక్కలా నవరత్నాల చక్రం లోగోలో జగన్‌ ముఖచిత్రం ఉండేలా విద్యుద్దీపాలతో గ్రామసర్పంచ్‌ సాదే ఆశాజ్యోతి ఏర్పాటు చేశారు. 

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పోటీచేసిన పంతం నానాజీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఆ పార్టీ మండల నాయకులు పైలాన్‌ను తొలగించాలని చూడగా గ్రామ కార్యదర్శి ఎస్‌కే నాగేంద్రకుమార్‌ జీఓ లేకుండా పైలాన్‌ తొలగించడానికి వీలులేదని చెప్పారు. తర్వాత నాగేంద్రకుమార్‌కు గ్రేడ్‌–1 కార్యదర్శిగా పదోన్నతి రాగా, బదిలీపై వెళ్లారు. 

తర్వాత మళ్లీ జేఎస్‌పీ నాయకులు పైలాన్‌పై ఉండే జగన్‌ చిత్రాన్ని తొలగించాలని పట్టుబట్టి తొలగించారు. పైలాన్‌ పైభాగంలో నాలుగుసింహాల బొమ్మను ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు. వైఎస్సార్‌ సీపీ జెండా రంగులు తొలగించి టీడీపీ, జనసేన రంగులు వేస్తే ఊరుకోబోమని, జాతీయజెండా రంగులు వేస్తే అభ్యంతరం లేదని, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పేరుతో ఉన్న శిలాఫలకం తొలగించినా అంగీకరించమని సర్పంచ్‌ ఆశాజ్యోతి తెలిపారు. పనులు పూర్తయ్యాక, రంగులు ఏమి వేస్తారో వేచి చూస్తామని వైఎస్సార్‌ సీపీ నాయకులు తెలిపారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)