Breaking News

రూ.25 లక్షల విలువైన చేపల్ని చోరీ చేసిన టీడీపీ శ్రేణులు

Published on Sun, 06/30/2024 - 03:53

ఏర్పేడు: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పెనుమల్లంలోని పంచాయతీ చెరువులో రూ.25 లక్షల విలువైన చేపల్ని టీడీపీ కార్యకర్తలు దొంగిలించారని లీజుదారు ఘొల్లుమంటున్నాడు. ఈ మేరకు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. పెనుమల్లంలోని పంచాయతీ చెరువుకు గత ఏడాది అక్టోబర్‌లో పంచాయతీ అధికారులు లీజు వేలం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని నడుమూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు మునిరాజా రూ.50 వేల లీజుకు చేపల చెరువును దక్కించుకున్నాడు. 

సుమారు రూ.5 లక్షలు వెచ్చించి చేప పిల్లల్ని కొనుగోలు చేసి చెరువులో వేసి పెంచుతున్నాడు. చేపల చెరువు కాలపరిమితి ఆదివా­రంతో ముగియనుంది. కాగా.. టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా చెరువులోని చేపల్ని వలలతో పట్టుకుని తీసుకుపోయారు. ఇదేమిటని అడిగినందుకు చెరువు వద్దకు వస్తే తాట తీస్తామని బెదిరించడంతో బాధితుడు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. 

చెరువులోని సుమారు రూ.25 లక్షల విలువైన చేపలను టీడీపీ కార్యకర్తలు పట్టుకుని వెళ్లారని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్‌ను వివరణ కోరగా.. ఆదివారం వరకు చేపల చెరువుకు కాలపరిమితి ఉందని, సమస్యపై చర్చించి న్యాయం చేస్తామని చెప్పారు. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)