Breaking News

మితిమీరిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఆగడాలు

Published on Sun, 07/26/2026 - 06:01

గాందీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో రైవస్‌ కాలువ ఒడ్డున గత 30, 40 ఏళ్లుగా దుకాణాలు నడుపుతున్న చిరు­వ్యాపారుల జోలికి వస్తే సహించేది లేదని వైఎస్సార్‌ సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు అధికారపార్టీ నేతలను హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల కన్ను లెనిన్‌ సెంటర్‌పై పడిందని, ఈ ప్రాంతంపై గద్దల్లా వాలిపోయారని విమర్శించారు. గత ఆరు నెలలుగా మామూళ్ల కోసం వ్యాపారులను వేధిస్తున్నారని మండిపడ్డారు. మామూళ్లు ఇవ్వడానికి నిరాకరించిన చిరువ్యాపారులపై దౌర్జన్యం చేస్తున్నారని, షాపులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, షాపులు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారని దుయ్యబట్టారు.

చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసే వారి నుంచి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. లెనిన్‌ సెంటర్‌లో అధికారులు కరెంట్‌ కట్‌ చేసిన దుకాణాలను శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడారు. దుకాణాలకు విద్యుత్‌ సౌకర్యం కట్‌ చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లెనిన్‌ సెంటర్‌ నుంచి ఐఎంఏ హాలు వరకు పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆగడాలు మితిమీరిపోయాయని, ఈ ప్రాంతంలో 290 దుకాణాలు ఉంటే టీడీపీ నేతలు షాపునకు రూ.5 లక్షలు చొప్పున వసూలు చేస్తు­న్నారని విమర్శించారు. స్కానింగ్‌ సెంటర్లు, డయాగి్నస్టిక్‌ సెంటర్లు, హాస్పి­టల్స్‌ చివరికి డాక్టర్ల వద్ద కూడా బొండా అనుచరులు వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చేతిలో టౌన్‌ ప్లానింగ్, ఇరిగేషన్, పోలీసు శాఖలు కీలు»ొమ్మలుగా మారాయని మండిపడ్డారు. చిరువ్యాపారుల జోలికి వెళితే సహించేది లేదన్నారు. చిరువ్యాపారులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎ­స్సా­ర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)