Breaking News

శ్మశానంలో పూడ్చనివ్వం..!

Published on Mon, 06/23/2025 - 05:08

కుప్పం రూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రోజుకో ఆటవిక చర్య వెలుగు చూస్తూనే ఉంది. మొన్న శాంతిపురం మండలంలో ఎయిర్‌పోర్ట్‌ భూముల వ్యవహారంలో మహిళలను కొట్టడం, నిన్న కుప్పం మండలం నారాయణపురంలో భర్త అప్పు చెల్లించలేదని భార్యను చెట్టుకు కట్టేసి కొట్టడం, జరుగు పంచాయతీలో మగదిక్కు లేని మహిళను ఆస్తి తగాదాలో కట్టేసి కొట్టడం వంటి ఘటనలు అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఈ పరంపరలో తాజాగా ఆదివారం మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.

చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందిన వ్యక్తిని గ్రామంలో అంత్యక్రియలకు అనుమతించకుండా అడ్డుకున్న వైనం విస్తుగొలుపుతోంది. వివరాల్లోకి వెళితే...  కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన నాగరాజుకు శివానంద, మంజునాథ్, శివశంకర్‌ (35) అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. శివశంకర్‌ నెల రోజుల క్రితం డెంగీ జ్వరం బారిన పడ్డాడు. స్థానికంగా చూపించినా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని సెంట్‌ జాన్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివశంకర్‌ శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబీకులు మృతదేహంతో గ్రామానికి బయలుదేరారు.

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు.. మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చడానికి అనుమతించమని, సొంత పొలంలో ఖననం చేసుకోవాలని హుకుం జారీ చేశారు. అంత్యక్రియల సమయంలో ఆచారాలు (క్రతువు) నిర్వహించే ఇతర సామాజిక వర్గాల వారిని అడ్డుకున్నారు. ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా కనికరించ లేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం ఉదయం పోలీసులు  నచ్చజెప్పినా ససేమిరా అన్నారు. చివరకు డీఎస్పీ పార్థసారథి అక్కడికి చేరుకుని కేసు పెట్టాల్సి వస్తుందని మందలించడంతో వెనక్కు తగ్గారు. పోలీసు భద్రత మధ్య వారు శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)