Breaking News

మండలంలో లేకుండా చేస్తాం..

Published on Tue, 09/09/2025 - 05:25

పాలసముద్రం: అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్న టిప్పర్లు, పొక్లెయిన్‌ను తహసీల్దార్, ఎస్‌ఐ అడ్డుకుని వాటిని సీజ్‌ చేసినందుకు వారిని మండలంలో లేకుండా చేస్తామని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్‌ ప్రధాన అనుచరుడు ఒకరు బెదిరించాడు. పైగా.. ‘మీకు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది’.. అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. 

చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..పాలసముద్రం మండలం నుంచి టీడీపీ కూటమి నాయకులు మూడు, నాలుగు నెలలుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్‌ అరుణకుమారి, ఎస్‌ఐ చిన్నరెడ్డప్పకు ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో.. సోమవారం వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్టల్లో నుంచి అనుమతుల్లేకుండా తమిళనాడుకు ఎర్రమట్టి తరలిస్తున్న సంఘటన వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకుని తొమ్మిది టిప్పర్లు, రెండు పొక్లెయిన్లను సీజ్‌చేశారు. ఇలా ఎర్రమట్టిని అక్రమంగా తరలించకూడదని ఎస్‌ఐ రెడ్డప్ప వాహనాలను పోలీస్‌స్టేషన్‌కి తరలిస్తుంటే టీడీపీ కూటమి నాయకులు వారిపై గొడవకు దిగారు.  

అధికారులకు వేలు చూపిస్తూ హెచ్చరికలు..: ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే థామస్‌ ప్రధాన అనుచరుడు, చెన్నైకి చెందిన శరవణ అక్కడకు చేరుకున్నాడు. టిప్పర్ల యజమానులతో కలిసి ఆయన తహసీల్దార్‌ అరుణకుమారిని, ఎస్‌ఐ రెడ్డప్పను ‘మీకు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది. త్వరలో మిమ్మల్ని మండలంలో లేకుండా చేస్తా’.. అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. ఇదే సమయంలో అక్కడ ఫొటోలు తీస్తున్న సాక్షి విలేకరిని ‘నువ్వెవరు ఫొటోలు తీయడానికి.. నీ అంతుచూస్తా’.. అంటూ బెదిరిస్తూ పైపైకి దాడి చేయడానికి వస్తూ దూషించాడు. తోటి విలేకరులు రావడంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నాడు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)