చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి

Published on Thu, 07/30/2026 - 04:58

సాక్షి ప్రతినిధి, కడప: ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందని ఆశించాం. అలాంటిదేమి లేకపోగా, అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నా ఏసీబీ కట్టడి చేయడంలేదు. ఎమ్మెల్యేగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా. ముందు డబ్బులిస్తేనే పని చేస్తామన్నట్లుగా అధికారులు తయారయ్యారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే లంచాల్లో వాటాలు పంచుకోవడం మినహా కట్టడి చేయడంలేదు’ అని వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వ్యాఖ్యానించారు. 

ఆయన బుధవారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు తీరుతెన్నులపై మండిపడ్డారు. అధికారుల వద్దకు ప్రభుత్వ పనికోసం వెళ్లిన ప్రతీఒక్కరూ డబ్బు చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్‌ డిపార్టుమెంటు ఇలా అన్నింటా ఈ పరిస్థితి ఉందన్నారు. వరదరాజులరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. 

చిరుద్యోగులకు అందని జీతాలు 
ఇటీవల కాలంలో గోపవరం, కొత్తపల్లె పంచాయతీలో వీధుల్లో ఊడ్చేందుకు కొంతమంది సిబ్బందిని నియమించారు. వారికి నాలుగు నెలల నుంచి జీతం ఇవ్వలేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారు నెలనెలా జీతాలు తీసుకుంటుండగా వీరికెందుకు ఇవ్వడంలేదు? పారిశుధ్య కార్మికులు చేసే పని మనం చేయలేం. అయినా వారికి నెలనెలా జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా పట్టించుకోవడంలేదు. పైగా.. జీతాలిచ్చే విషయంలో మనకేమైనా వస్తుందా? అనే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేవారు లేరు. 

విచ్చలవిడిగా బెట్టింగ్, మట్కా, గుట్కా 
ప్రొద్దుటూరులో క్రికెట్‌ బెట్టింగ్, గంజాయి, గుట్కా, మట్కా వ్యవహారాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఇది వేలాది మంది ప్రజలకు సంబంధించిన సమస్య. అధికారులు ఇలా తప్పు చేసిన వారిని పట్టుకుని వారి నుంచి డబ్బు వసూలుచేసుకుంటున్నారు. ఈ మధ్య అగ్రిగోల్డ్‌ భూమికి సంబంధించి దొంగ డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. దొంగ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే అధికారులేం చేస్తున్నారు? సబ్‌రిజి్రస్టార్లు కూడా దొంగ రిజి్రస్టేషన్లపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలేదు. పోలీసుల దృష్టికి వెళ్లినా చర్యల్లేవు.

లంచాల కోసమే అన్నట్లుగా.. 
లంచగొండితనానికి అడ్డుకట్ట వేయలేని పరిస్థితిలో ఉన్నాం. అధికారులకు లక్షలాది రూపాయలు జీతాలు వస్తున్నా వారిలో మార్పులేదు. ప్రజల్లో తిరుగుబాటు రావాలి. ఈ విషయంలో ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరు. కిందిస్థాయి అధికారిపై ఫిర్యాదు చేస్తే అతను పైస్థాయి అధికారి వద్దకు వెళ్లి మేనేజ్‌ చేసుకునే పరిస్థితి ఉంది. స్వయంగా నేను ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుకు ఎలాంటి జవాబులేదు. ఇంత అధ్వాన్న పరిస్థితుల్లో అధికారులు నడుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయాధికారులు సలహాలిచ్చే దిక్కులేదు.

నిస్సహాయ స్థితిలో ఉన్నా.. 
ఎవరికీ న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా. దీంతో నేను ఎందుకు ఉండాలనే ఆలోచిస్తున్నా. ఏ ఒక్క ఉద్యోగి నిజాయితీగా వ్యవహరించడంలేదు. పెన్నానగర్, ఈశ్వర్‌రెడ్డినగర్‌ ప్రాంతాల్లో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వారందరూ గుట్కాకు సంబంధించిన వివాదాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు నాకు సమాచారం ఉంది.

రాచమల్లు వ్యాఖ్యలు అక్షర సత్యం.. 
గత కొంతకాలంగా ఇక్కడ విచ్చలవిడి అవినీతి చోటుచేసుకొంటోందని.. క్రికెట్‌ బెట్టింగ్, మట్కా, గుట్కా బ్యాచ్‌లు చెలరేగిపోతున్నాయని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేసిన ఆరోపణలు అక్షరసత్యం.  

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)