Breaking News

నాపై లైంగిక వేధింపుల కేసును కొట్టేయండి

Published on Wed, 09/11/2024 - 03:56

సాక్షి, అమరావతి: అత్యాచారం ఆరోపణలపై తనపై తిరుపతి తూర్పు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టకుండా ఆరోపణల్లో సత్యాలను శోధించకుండా తనపై కేసు నమోదు చేయడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

పోలీసులు తనపై నమోదు చేసిన కేసు సెక్షన్‌ 173(1)కి విరుద్ధమన్నారు. ఈ మొత్తం ఘటన ‘హనీ ట్రాప్‌’ గా ఆయన ఆభివర్ణించారు. జూలై, ఆగస్ట్‌ల్లో ఘటన జరిగిందని వరలక్ష్మి చెబుతున్నారని, అయితే ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేసిందో మాత్రం చెప్పడం లేదన్నారు.   

బెయిల్‌ మంజూరు చేయండి : మాజీ ఎంపీ నందిగం సురేష్‌ 
టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటన కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ బాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. 

రాజకీయ కక్షతోనే తనను ఈ కేసులో ఇరికించారని తెలిపారు. 2021లో ఘటన జరిగితే రెండేళ్ల తరువాత తనపై కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం తాను జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నానని తెలిపారు. తనపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కూడా పూర్తయిందన్నారు. తనపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 

తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, బెయిల్‌ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా ఇదే కేసులో జైలులో ఉన్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు అవుతు శ్రీనివాస్‌రెడ్డి కూడా బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 

హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
రాష్ట్రానికి ప్రత్యేక హోదానిచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్‌ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీ సులిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)