Breaking News

సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన

Published on Wed, 05/10/2023 - 07:46

సాక్షి, పశ్చిమగోదావరి:  జిల్లాలోని పాలకొల్లులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం సీఐ, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అనుమతిలేని కార్యక్రమాలు నిర్వహించరాదని అడ్డుకున్న సీఐని ఏకవచనంతో సంబోధించడమేగాక మా ఇష్టం వచ్చింది చేసుకుంటామంటూ మాట్లాడారు. రైతుల సమస్యలపై స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ తదితరులు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు.

టీడీపీ నేతలు తహసీల్దార్‌ కార్యాలయం పక్కన ఉన్న చెట్టు కొమ్మలను విరగ్గొట్టి రైతుకు ఉరి అనే నినాదంతో రెండు కర్రలను ఏర్పాటు చేసి చెట్టుకు కట్టారు. ప్లకార్డులు, ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. దీన్ని పట్టణ సీఐ డి.రాంబాబు అడ్డుకున్నారు. వినతిపత్రం ఇస్తామని అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నిమ్మల పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ

ఐ రాంబాబునుద్దేశించి.. నీకు సంబంధం ఏమిటి? మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం. రోడ్డుపై ఏది చేసుకున్నా నీకు అనవసరం. నీ తహసీల్దార్‌ కార్యాలయంలో చేస్తే నువ్వు ప్రశ్నించు.. అంటూ మాట్లాడారు. దీనిపై సీఐ స్పందిస్తూ.. సార్‌ నేను గౌరవంగా మాట్లాడుతున్నాను.. మీరు మర్యాదగా మాట్లాడండి.. అని సూచించారు. దీంతో మీ మంత్రి రైతులను ఉద్దేశించి ఎర్రిపప్ప అన్న మాటలకు మాకు బాధేసింది అంటూ ఎమ్మెల్యే టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఉరితాళ్లను తొలగించారు. అనంతరం టీడీపీ నేతలు తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి అక్కడున్న ఆర్డీవో దాసి రాజుకు వినతిపత్రం అందజేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)