Breaking News

తిరువూరులో పీఎస్‌లో కొలికపూడి హల్‌చల్‌.. పోలీసులకే ఝలక్‌!

Published on Wed, 07/23/2025 - 07:32

సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పోలీసు స్టేషన్‌లో హల్‌చల్‌ చేశారు. పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. గంజాయి అ‍మ్మకాలకు కొమ్ముకాస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. దీంతో, పోలీసుల వ్యవహారం, ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

వివరాల ప్రకారం.. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు సాయి సుమిత్‌, రామకృష్ణ మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరు పచ్చ పార్టీ కార్యకర్తలను తిరువూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వీరిలో ఎంపీ వర్గానికి చెందిన సాయి సుమిత్‌ను పోలీసులు వదిలేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి వర్గానికి చెందిన రామకృష్ణపై పోలీసులు సెక్షన్‌-307 కింద కేసు పెట్టారు. అయితే, ఈ ఘర్షణ తర్వాత రామకృష్ణ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో పోలీసులు.. అతని తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మీలను స్టేషన్‌కు తీసుకువచ్చారు.

ఇక, ఇదే సమ​యంలో తిరువూరు పోలీసు స్టేషన్‌లో ఓ సెటిల్‌మెంట్‌ కోసం టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి వెళ్లారు. ఈ సందర్బంగా రామకృష్ణ కుటుంబ సభ్యులను చూసిన కొలికపూడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్‌కు పిలిపించే వరకూ కదిలేది లేదంటూ హంగామా చేశారు. ఒక్కరిపైనే ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు. అలాగే, పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారంటూ స్టేషన్‌లో రచ్చ చేశారు. దీంతో, ఏం చేయాలో తెలియక పోలీసులు ఖంగుతిన్నారు.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)