Breaking News

ఎన్టీఆర్‌ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణం

Published on Tue, 04/22/2025 - 05:00

సాక్షి ప్రతినిధి, ఏలూరు/మంగళగిరి: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వేధింపులు తట్టుకోలేక దాసరి బాబూరావు (60) అనే వృద్ధుడు గుంటూ­రు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. దెందులూరు మండలం చల్లచింతలపూడి­లో వి­జ­యవాడకు చెందిన బాబూరావుకు 9.57 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో గ్రావెల్‌ తవ్వుకుంటా­మని కొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఉసులూరి సత్యనారాయణ, బోస్, నాగబోయిన సత్యనారాయణ కోరారు. అన్ని అనుమతులతో వస్తే అభ్యంతరం లేదని బాబూ­రావు తెలిపారు.

అయితే ఎలాంటి అనుమతులూ లేకుండానే అడ్డగోలుగా నెల రోజుల్లోనే సుమారు 2,000 లారీల గ్రావెల్‌ను తవ్వేశారు. ఇదేమిటని ప్రశి్నంచిన దాసరి బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ దారుణంపై దెందులూరు తహసీల్దార్, మైనింగ్‌ ఏడీ, ఏలూరు ఎస్పీ, దెందులూరు ఎస్సైలకు మూడు నెలల క్రిత­మే బా­బూ­రావు ఫిర్యాదు చేశారు. జనసేన, టీడీపీ పా­ర్టీ కా­ర్యాలయాల్లో రెండుసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.

మరోవైపు తమ పార్టీ నేతల­తో రాజీ చేసుకోవాలని.. లేకుంటే అంతు చూస్తాన­ని చింతమనేని ప్రభాకర్‌ నుంచి బాబూరావుకు బెదిరి­ంపులు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన బాబూ­రావు, ఆయన భార్య నాగలక్ష్మి సోమవారం టీ­డీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తమకు న్యాయం జరగ­డంలేదన్న ఆవేదనతో ఒక్కసారిగా ఎన్టీఆర్‌ విగ్ర­హం ఎదుట బాబూరావు తన ఎడమ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయ­న భార్య అడ్డుకుని హుటాహుటిన తన భర్తను ఆస్పత్రికి తరలించారు.  

ఆత్మహత్యే శరణ్యం 
‘కొద్ది నెలలుగా మా పొలంలో టీడీపీ నేతలు గ్రావెల్‌ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలను ఆపి న్యాయం చేయండని తహసీల్దార్‌ నుంచి ఎస్పీ వరకూ మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఏలూరు ఎస్పీ చర్యలు తీసుకోకపోగా మాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు.. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీబీలు, లారీలు అన్నీ మా పొలం వద్దే ఉన్నాయి. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం.’ – నాగలక్ష్మి, బాబూరావు భార్య  

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)