ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
‘మాకు అధికారం ఉంది..మేం తలచుకుంటే నరికేయగలం’
Published on Mon, 04/20/2026 - 05:03
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఏంట్రా యదవల్లారా మీరు నరికేది. మేమే నరకగలం. మాకు అధికారం ఉంది. మేం తలచుకుంటే మిమ్మల్ని నరికేయగలం’ అని కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రెచ్చిపోయారు.
ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే అంబటి అయినా.. గిమ్మటి అయినా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. అసలు ప్రజాస్వామ్యం గురించి వైఎస్సార్సీపీకి తెలుసా?’ అంటూ మండిపడ్డారు. జగన్కి అమరావతిలో అభివృద్ధి జరగడం ఇష్టం లేదన్నారు.
కాగా, రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో వెర్రితలలు వేస్తోందో చెప్పడానికి బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ప్రొటెం స్పీకర్గా.. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన బుచ్చయ్యచౌదరి ఈ స్థాయిలో దిగజారి దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Tags : 1