Breaking News

ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ అరాచకాలు

Published on Tue, 07/07/2026 - 11:07

సాక్షి,నంద్యాల: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల అరాచకాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దేవస్థానానికి సంబంధించిన తలనీలాల టెండర్ల ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే అఖిలప్రియ ముఖ్య అనుచరులు కొందరు టెండర్ దారులను బహిరంగంగానే బెదిరింపులకు గురిచేయడం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది.

ప్రాణం మీద ఆశ ఉంటే వెనక్కి పోండి
అహోబిలం పుణ్యక్షేత్రంలో తలనీలాల సేకరించే హక్కుల కోసం దొరై కంపెనీ యజమాని నిబంధనల ప్రకారం టెండర్ దాఖలు చేశారు. అయితే, ఈ టెండర్ తమ వర్గానికి కాకుండా ఇతరులకు ఎలా దక్కుతుందంటూ ఎమ్మెల్యే అనుచరులు సదరు కాంట్రాక్టర్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ‘నీకు ప్రాణం మీద ఆశ ఉంటే వెంటనే అహోబిలం తలనీలాల టెండర్‌ను రద్దు చేసుకోవాలి..లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అంటూ ఫోన్ చేసి  బెదిరించాడు.    

భూమా అఖిలప్రియ అరాచకాలు బయటపడ్డ సంచలన ఆడియో

కాంట్రాక్టర్‌ను బెదిరిస్తూ భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరులు మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ప్రాణ భయంతో ఉన్న కాంట్రాక్టర్ ఈ ఆడియోను బయటపెట్టడంతో ఎమ్మెల్యే వర్గీయుల సెటిల్మెంట్లు, బెదిరింపుల వ్యవహారం బహిర్గతమైంది. అధికార బలంతో స్థానిక వ్యాపారులను, టెండర్ దారులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఆళ్లగడ్డ మండలాన్ని అరాచకాలకు అడ్డాగా మారుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)