Breaking News

టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ.. ‘స్టాంప్‌ డ్యూటీ’ స్కామ్‌

Published on Tue, 06/24/2025 - 05:33

అనంతపురం, సాక్షి అమరావతి, సాక్షి టాస్క్ఫోర్స్‌: ఇదో భారీ కుంభకోణం! ఓ దళారీని అడ్డుపెట్టుకుని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఫోర్జరీతో రూ.వందల కోట్ల మేర బ్యాంకు రుణాలు కాజేసిన ఓ కంపెనీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టు కథలు చెబుతోంది. స్టాంప్‌ డ్యూటీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, తప్పుడు ఈ – స్టాంప్‌లతో బ్యాంకులు, ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాలను మోసం చేసిన ఓ టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం ఇదీ!! తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేశారు. ఆస్తుల విలువను అధికంగా చూపించి ఫేక్‌ పత్రాలు సృష్టించారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకుని ఈ – స్టాంప్‌ డ్యూటీ చెల్లింపుల్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దీన్ని ఓ దళారీపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్‌ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్‌ ఎందుకు తీసుకుంటాడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ స్టాంప్‌ల కోసం మీ–సేవ సెంటర్‌ నిర్వాహకుడు బాబుతో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడు. ‘మీ–సేవ బాబు’ కూడా టీడీపీ కుటుంబ సభ్యుడే! మహానాడులో కూడా పాల్గొన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఎమ్మెల్యే సురేంద్ర ఇంట్లో మనిíÙలా మీసేవ బాబు వ్యవహరిస్తుంటాడు. ఈ కుంభకోణం వివరాలివీ...

బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణం
టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీని కోసం ముందుగా స్టాంప్‌డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ–స్టాంప్‌ పొందాలి. రిజి్రస్టేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీలు చెల్లించాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్‌ డ్యూటీ కింద కంపెనీ కట్టాలి. అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలి. అయితే ఎస్‌ఆర్‌సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖను మోసగించింది! 

మోసం చేశారిలా.. 
ఈ–స్టాంప్‌లో 0.5 శాతం చెల్లించాల్సిన మొత్తాన్ని స్వల్పంగా చూపించి డాక్యుమెంట్‌ను మీ–సేవ బాబు జనరేట్‌ చేస్తాడు. జనరేట్‌ అయిన డాక్యుమెంట్‌లో స్టాంప్‌ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్‌ చేసి నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలో ఆ మొత్తాన్ని ఎంటర్‌ చేసి మరో ప్రింట్‌ తీసి కంపెనీ ప్రతినిధులకు అందించాడు. దీన్ని బ్యాంకులకు సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా స్టాంప్‌ డ్యూటీ చెల్లింపులో కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పుడు ఈ – స్టాంప్‌ పత్రాలను సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకోవడం ద్వారా బ్యాంకును, ఆర్‌బీఐని మోసగించారు.

టాటా క్యాపిటల్స్‌ రుణాల్లోనూ ఇదే స్కామ్‌  
ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ టాటా క్యాపిటల్స్‌ నుంచి రూ.20 కోట్లు రుణం తీసుకునేందుకు 2024 నవంబర్‌ 7న ఈ–స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు. దీనికి కేవలం రూ.200 మాత్రమే ఈ–స్టాంప్‌ డ్యూటీ కట్టారు. ఈ డాక్యుమెంట్‌లో స్టాంప్‌డ్యూటీ మొత్తాన్ని ఎడిట్‌ చేసి 0.5 శాతం చొప్పున రూ.10 లక్షలుగా అంకెలు మార్చి టాటా క్యాపిటల్స్‌కు సమర్పించారు. ఈ విధంగా బ్యాంకు రుణాల్లో ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కుంభకోణానికి పాల్పడింది.

 స్టాంప్‌ డ్యూటీ కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు అందడంతో స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో పాటు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యేకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కంపెనీ ప్రతినిధులు తనకు డబ్బులు ఇచి్చనట్లు, అయితే తానే ఆ డబ్బులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడినట్లు ఈ–సేవా నిర్వాహకుడు బాబుతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు ఓ ఆడియో రికార్డును కూడా  తీసుకున్నట్లు తెలుస్తోంది.

బుకాయిస్తే మాత్రం దాగుతుందా..! 
స్టాంప్‌ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కంపెనీ చెక్‌ ఇచ్చి ఉండాలి. లేదంటే ఆర్‌టీజీఎస్, డీడీతో పాటు ఏ రకమైనా చెల్లింపులైనా వైట్‌మనీగానే చెల్లించాలి. ఎస్‌ఆర్‌ కంపెనీ ఆ రకమైన చెల్లింపులు చేయలేదు. దీంతో మీ–సేవా బాబు­కు తాము డబ్బులు ఇచ్చామని బలవంతంగా ఒప్పించినా, అందులో వాస్త­వం లేదని బహిర్గతం అవుతుంది. కంపెనీ మోసం బట్టబయలవుతుంది.

ఈ రెండు రుణాలు మాత్రమే కాదని, తప్పుడు ఈ–స్టాంప్‌ పత్రాలతో చాలా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఫేక్‌ ఈ–స్టాంపు పేపర్లను విక్రయించిన మీసేవ బాబు, ఆయ­న భార్య కట్టా భార్గవిపై అనంతపురం టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌­ఆర్‌ ఇన్‌ఫ్రా ప్రతినిధి గుంటూరు సతీ­ష్‌బాబు పేర్కొన్నారు. తమ అకౌంట్స్‌ విభాగం డాక్యుమెంట్లను పరిశీలించగా ఈ–స్టాంపుల ఫోర్జరీ వెలుగులోకి వచి్చందన్నారు. మీ–సేవ బాబు అలియాస్‌ బోయ ఎర్రప్ప, కట్టా భార్గవిపై బీఎన్‌ఎస్‌ 318(4), 338, 340, ఆర్‌/­డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)