Breaking News

టీడీపీ లిక్కర్‌ సిండికేట్ కుట్ర.. భారీ మార్జిన్‌కు 'పచ్చ' స్కెచ్‌

Published on Tue, 08/26/2025 - 20:18

సాక్షి, విజయవాడ: టీడీపీ లిక్కర్‌ సిండికేట్ కుట్రకు తెరతీసింది. మద్యం బార్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. 840 బార్లలో 52 బార్లకే  ఆఫ్లికేషన్లు దాఖలయ్యాయి. బార్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు రాకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ అడ్డుకుంది. భారీగా మార్జిన్‌ పెంచుకునేందుకు టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్రకు తెరతీసింది.

లిక్కర్ సిండికేట్‌కి సరెండర్ అయిన చంద్రబాబు సర్కార్‌.. 29వ తేదీ వరకు  అప్లికేషన్లకు గడువు పెంచింది. మంత్రి వర్గం ఉపసంఘం ద్వారా మార్జిన్ పెంచుకోవడానికి లాబీయింగ్‌ చేశారు. ఇతరులెవ్వరిని బార్ల కోసం దరఖాస్తు చేసుకొనివ్వకుండా టీడీపీ సిండికేట్ బెదిరింపులకు దిగారు.

ఇంత తక్కువగా దరఖాస్తులు దాఖలు కావడం వెనుక టీడీపీ మద్యం సిండికేట్‌ వ్యూహాత్మక ఎత్తుగడ దాగుంది. బార్ల దరఖాస్తుల కోసం అయితే ఏకంగా 2,300 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పటికీ.. వీరిలో తమ సిండికేట్‌ కాని వారిని గుర్తించిన టీడీపీ నేతలు.. దరఖాస్తు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ గూండాలు, పోలీసు అధికారులతో వారిని బెదిరిస్తున్నారు.

ఇక సిండికేట్‌కు అనుకూలంగా బార్‌ విధానంలో ముందే మార్పులు చేస్తే తమ దోపిడీ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే.. తగినంత మంది దరఖాస్తు చేయలేదు కాబట్టి బార్ల యజమానులకు లాభాల మార్జిన్‌ పెంచుతున్నాం అన్నట్లుగా ప్రజల్ని నమ్మించాలన్నది అసలు తంత్రం. అలాగే, 840 బార్లలో కనీసం 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు రాలేదు కాబట్టి సిండికేట్‌ దోపిడీకి వీలుగా ఇలా బార్‌ విధానంలో మార్పులు చేయాలన్నది పచ్చముఠా పన్నాగం.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)